Sunday, May 5, 2024
- Advertisement -

కొత్తగా రూ. 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు..!

- Advertisement -

దేశాన్ని వస్తు తయారీ రంగ కేంద్రంగా మార్చి ‘ఆత్మ నిర్భర్​ భారత్​’ లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలన్న ఉద్దేశంతో పది పారిశ్రామిక రంగాలకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకం కింద అయిదేళ్లలో రూ. 2 లక్షల కోట్లు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్​ సమావేశం నిర్ణయించింది.

ప్రస్తుతానికి రూ. 1.45 లక్షల కోట్ల కేటాయింపులను ప్రకటించినప్పటికీ అయిదేళ్ల నాటికి ఈ మొత్తం రూ. 2 లక్షల కోట్ల వరకు చేరవచ్చని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, ప్రకాశ్​ జావడేకర్​లు వెల్లడించారు. కేబినెట్​ సమావేశానంతరం వారు విలేకర్లతో మాట్లాడారు.

నిర్మలా సీతారామన్​ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనను దృష్టిలో ఉంచుకొని వాటికి అత్యధిక అవకాశం ఉన్న ప్రాజెక్టులకే ప్రోత్సాహకాల్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. భారత్​ను స్వావలంబన దేశంగా నిలబెట్టాలన్నదే ఇందులో ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ పథకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు భారత్​కు రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు.

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు!

తప్పు చేస్తే పోలీసులను వదలం : సీఎం జగన్

గుడికి వెళ్లేవారికి శివలింగాలే ప్రసాదం..!

జో బైడెన్ పక్కన భారతీయ కూటమి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -