సందు దొరికి నప్పుడల్లా ఇండియామీద అక్కసలు వెల్ల గక్కే పాకిస్తాన్‌కు భారత్ మాత్రం ఎప్పుడూ స్తేహహస్తాన్నె అందిస్తుంది. మానవతా దృక్పథంలో పాకిస్థాన్ పౌరులను ప్రతీ సారి ఆదుకుంటోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్థాన్ పౌరులకు ఆపరేషన్స్ కోసం మానవతా దృక్పధంతో ప్రతీ ఒక్కరికి భారత విదేశాంగ శాఖ వీసాలను చేస్తోంది.
తా జాగా దీపావళికి పాకిస్థానీయులకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంచి బహుమతిని ఇచ్చారు. భారత దేశంలో ఆరోగ్య చికిత్సల కోసం అర్జీ పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న అర్హులైన వారందరికీ మెడికల్ వీసాలు జారీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
గతంలో వీలైనంత త్వరగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ వీసాలను క్లియర్ చేయనున్నట్లు ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న మెడికల్ వీసాలన్నింటినీ అనుమతిస్తున్నాం’ అని సుష్మా చేసిన ట్వీట్ సారాంశం. దానిలో భాగంగానె ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సుస్మాస్వరాజ్.
ఇటీవల కంటి కేన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారికి, ఎముక మజ్జ మార్పిడి చికిత్స అవసరమైన ఓ వ్యక్తికి, కాలేయ చికిత్స అవసరమైన మరో ఇద్దరికి మెడికల్ వీసాలు జారీ చేయాలని పాకిస్థాన్‌లోని భారత హై కమిషన్‌ను ఆమె ఆదేశించారు. అంతేకాకుండా ట్విట్టర్ ద్వారా ఆమె దృష్టికి వచ్చిన అన్ని రకాల మెడికల్ ఎమర్జెన్సీలకు ఆమె వీసా జారీ చేసిన సంగతి తెలిసిందే.
On the auspicious occasion of Deepawali, India will grant medical Visa in all deserving cases pending today. @IndiainPakistan
— Sushma Swaraj (@SushmaSwaraj) 19 October 2017