Tuesday, May 21, 2024
- Advertisement -

ప్ర‌భుత్వ స‌ల‌హాదారునిగా డైన‌మిక్ మాజీ సీఎస్‌ను నియ‌మించిన జ‌గ‌న్‌..

- Advertisement -

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న జ‌గ‌న్ ముందున్న అతి పెద్ద స‌మ‌స్య… గాడి త‌ప్పిన ఆర్థిక వ్వ‌వ‌స్థ‌ను దారిలో పెట్ట‌డ‌మే. ఇప్ప‌టికే ప‌రిపాల‌న‌లో అధికారుల విష‌యంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న జ‌గ‌న్ తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర అర్థిక వ్వ‌వ‌స్థ గ‌డ్డుప‌రిస్థితులు ఎదుర్కొంటోంది. క‌నీసం ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గ‌ట్టెక్కించేందుకు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ముఖ్య‌మైన శాఖ‌ల్లో డైన‌మిక్ అధికారుల‌ను నియ‌మించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారునిగా మాజీ సీఎస్ అజ‌య్ క‌ల్లాంను నియ‌మించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నవ్యాంధ్రకు ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం సేవలు అక్కరకు రానున్నాయి. ఆయ‌న‌కు కేబినేట్ హోదా క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వ‌లు జారీ చేసింది. చంద్ర‌బాబు హ‌యాంలో దుబారా ఖ‌ర్చుల‌తో ఖ‌జానాను అమాంతం నాకేశారు. అప్పులు తీసుకొనె ప‌రిస్థితి కూడా లేకుండా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దిగ‌జార్చారు బాబు.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సీఎంవోలోని కార్యదర్శులకు ఆయన నేతృత్వంవహిస్తారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు సూచనలు, సలహాలు చేయడంతో పాటు ఇతర సలహాదారులకు నేతృత్వంవహిస్తారు. 1983 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం. నవ్యాంధ్రకు స్వల్పకాలం పాటు సీఎస్‌గా పనిచేసిన ఆయన…2017 మార్చి 31న పదవీవిరమణ చేశారు. ముక్కుసూటితనం కలిగిన ఐఏఎస్ అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితిపై గతంలో ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీలో అవినీతి పెరిగిందని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విభ‌జ‌న స‌మ‌స్య‌లు, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల ప‌ట్ల అజ‌య్ క‌ల్లాంకు మంచి అవ‌గాహ‌న ఉంది. దీనిలో భాగంగానె అజ‌య్ కల్లామ్ తాడే ప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.ఏపీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -