Wednesday, May 7, 2025
- Advertisement -

అరుణ్ జైట్లీ ఆరోగ్యం అత్యంత విషయం…

- Advertisement -

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీన అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన జైట్లీకి వైద్య బృందం ప్రత్యేక చికిత్స నిర్వహిస్తున్నారు. గత వారంలో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్పించిన సంగతి తెలిసిందే. 9వ తేదీ నుంచి ఆయన్ను ఐసీయూలోనే ఉంచిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు.

ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండటంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎమ్స్ కు బయలు దేరారు. 66 ఏళ్ల అరుణ్ జైట్లీ ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు. అనారోగ్యం కారణంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అనారోగ్యం కారణంగానే 2019 మధ్యంతర బడ్జెట్ ను కూడ పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -