Thursday, May 2, 2024
- Advertisement -

రామోజీ సీరియస్ అంటూ వార్తలు.. నిజమిదే..

- Advertisement -

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మరణంతో అంతా విషాధచాయలు అలుముకున్నాయి. బీజేపీలో వరుసగా రెండో సీనియర్ మరణంతో ఆ పార్టీ కోలుకోకుండా ఉంది. మొన్ననే సుష్మ స్వరాజ్ మరణంతో శోకసంద్రంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు అరుణ్ జైట్లీ మరణం మరింత విషాదం నింపింది.

మూత్రపిండాల మార్పిడి చేసుకోవడం.. ఆరోగ్యం క్షీణించడంతో జైట్లీ ఈనెల 9న ఎయిమ్స్ లో చేరి ఈరోజు తుది శ్వాస విడిచాడు. అయితే అఫీషియల్ గా ఎయిమ్స్ ప్రకటించడంతో అందరూ బాధాతాప్త హృదయంతో ఉన్నారు.

ఇక జైట్లీ చావును దిగమింగకముందే మరో ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు పరిస్థితి విషమంగా ఉందని.. ఆయనను రామోజీ ఫిలింసిటీలోనే ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారని వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు ప్రసారం కూడా చేశాయి.

అయితే ఈనాడు వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. రామోజీకి బాగా లేదని వస్తున్న ఫోన్లకు వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావు నిక్షేపంగా ఉన్నారని.. ఈ పొద్దున్న లేచి పేపర్లు అన్ని చదివి నోట్ చేసుకొని మరీ సలహాలు , సూచనలు ఇచ్చారని చెబుతున్నారు.

ఇలా సోషల్ మీడియా వచ్చాక దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిక్షేపంగా ఉన్న రామోజీని బాగా లేదంటూ విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి ప్రచారం చేసే ముందు నిర్ధారించుకుంటే మంచిదనంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -