Tuesday, May 7, 2024
- Advertisement -

ర‌ష్యా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పుతిన్‌కు పోటీగా మాజీ పోర్న్ స్టార్‌….

- Advertisement -

ప్ర‌స్తుతం మాజీ పోర్న్ స్టార్స్ సినిమా రంగంలోకే కాకుండ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు. తాజాగా త్వ‌ర‌లో జ‌రిగె ర‌ష్టా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు పుతిన్‌కు పోటీగా మాజీ పోర్న్‌స్టార్ పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించింది. వాయువ్య రష్యాలోని ముర్మానస్క్‌కు చెందిన ఎలీనా బెర్కోవా ఈ సంచలన ప్రకటన చేశారు.

సోచి మేయర్‌గా కూడా పోటీ చేసిన ఆమె.. సోషల్ మీడియాలో ఈ మేరకు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఎలీనా(32).. అధ్యక్ష పదవికి పోటీ చేసే నాలుగో మహిళగా రికార్డులకెక్కనున్నారు.

అధ్య‌క్షురాలిగా ఎన్నిక‌యితె లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు. మగవాళ్లు వీడాకులు ఇచ్చే అర్హత లేకుండా చేస్తానని, పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. అంతేగాక, 40సెం.మీల కంటే ఎక్కువగా ఉండే స్కర్టులు ధరిస్తే నేరంగా పరిగణిస్తామని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -