Thursday, May 16, 2024
- Advertisement -

రికార్డులు వస్తాయి.. పోతాయి.. కానీ దృష్టి మాత్రం ఆటమీదే.. : చతేశ్వర్ పుజారా

- Advertisement -

ఆటను మైదానంలో ఆడే క్రమంలో రికార్డుల గురించి ఆలోచించకుండా ఆటని మాత్రమే ఆస్వాదించడమే తనకి చాలా ఇష్టమని భారత టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా తెలిపారు. రంజీ ట్రోఫీలో భాగంగా ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా డబుల్ సెంచరీతో జట్టుకి భారీ స్కోరుని అందించిన సంగతి తెలిసిందే.

ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 12వ డబుల్ సెంచరీతో విజయ్ మర్చంట్స్ 70 ఏళ్ల పాత రికార్డుని పుజారా తాజాగా కనుమరుగు చేశాడు. ‘భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ చెరో 10 ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీలు సాధించారు. వ్యక్తిగతంగా ఆ దిగ్గజాల రికార్డుల్ని అధిగమించడం సంతోషానిచ్చే విషయమే.

ఇంకా చెప్పాలంటే గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కానీ.. ఈ రికార్డులపై నా దృష్టి ఉందదని.. ఎప్పుడు ఆటపైనే ఉంటుందని అన్నారు. ఎందుకంటే రికార్డులు వస్తాయి.. పోతాయి.. కానీ నేను మాత్రం పరుగులు చేస్తూనే ఉండాలి’ అని పుజారా వెల్లడించాడు. శ్రీలంకతో త్వరలోనే భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -