Tuesday, April 30, 2024
- Advertisement -

నెక్స్ట్ నువ్వే మూవీ రివ్యూ

- Advertisement -

ప్రభాకర్ బుల్లితెరపై నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయన వెండితెరపైకి పరిచయం అవుతూ చేసిన సినిమా ‘నెక్స్ట్ నువ్వే’. గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ , బన్నీ వాస్ లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఆది హీరోగా నటించిన ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది.. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సీరియల్స్ కు దర్శకత్వం వహించే కిరణ్ (ఆది).. ఒక గుండాకి ఇవాల్సిన అప్పు కారనంగా సిటీ నుంచి పారిపోయి అరకులో తన తండ్రి సంపాదించిన ఒక బంగ్లాకు వెళ్లి, దాన్ని రీమోడలింగ్ చేయించి రిసార్ట్స్ గా మార్చి బిజినెస్ మొదలు పెడతాడు. కానీ ఆ రిసార్ట్స్ కు వచ్చిన గెస్టులంతా చనిపోతుంటారు. దాంతో కిరణ్ షాక్ అయ్యి.. వీరి చావులకి కారణమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే అతనికి ఆ ఇంట్లో దెయ్యముందనే సంగతితో పాటు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ దెయ్యం ఎవరు, అది రిసార్ట్స్ లో ఎందుకుంది, కిరణ్ తెలుసుకున్న నిజాలేమిటి, చివరికి కిరణ్ తన రిసార్ట్స్ ను ఆ దెయ్యం బారి నుండి కాపాడుకున్నాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ముఖ్యమైన ప్లస్ పాయింట్ అంటే బ్రహ్మాజీ కామెడీ. ఆయన సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కామెడీతో తెగ నవ్వించాడు. ప్రధానంగా ఫస్టాఫ్ లో అతని కామెడీకి తెగ నవ్వుకుంటారు. బ్రహ్మాజీ చాలా నవ్వించే పాత్రలు చేసిన ఈ సినిమాలో పాత్రం మాత్రం చాలా బిన్నంగా ఉంది. బ్రహ్మాజీ సరైన కామెడీ టైమింగ్ తో పాటు, నవ్వు తెప్పించే బాడీ లాంగ్వేజ్ తో పాత్రకు న్యాయం చేశాడు. ఆది తన నటనతో ఎప్పటిలాగే చేశాడు. ఇక సినిమాను నార్మల్ గానే స్టార్ట్ చేసిన దర్శకుడు ప్రభాకర్ కొద్దిసేపటికి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జానర్లోకి తీసుకెళ్లి ఇంటర్వెల్ వరకు పర్వాలేదనే రీతిలో ఆహ్లాదాన్ని అందించాడు. ఇక బ్రహ్మాజీ చెల్లెలిగా రష్మీ నటన బాగుంది. సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. రెండవ అర్థ భాగంలో వచ్చే హర్రర్ సీన్స్ పర్వాలేదు. పళని సినిమాటోగ్రఫీ బాగుంది. తీసింది కొని లొకేషన్లలోనే అయినా చక్కగా చేశాడు. గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ , బన్నీ వాస్ లు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. ప్రధానంగా సెకండాఫ్ కథనం. మొదటి భాగంను కామెడీతో లాక్కొచ్చిన ప్రభాకర్ సెకండాఫ్ లో అసలు కథేమిటో రివీల్ చేయకపోవడం పెద్ద మైనస్. రిసార్ట్స్ లో దెయ్యం ఎందుకుంది.. దాని స్టోరీ ఏంటి.. దానికేం కావాలి, అతిథులందరినీ ఎందుకు చంపుతుంది వంటి కీలక అంశాలకి జస్టిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో సినిమా కంక్లూజన్ ఏమిటో అస్సలు అవగతం కాలేదు. సెకండాఫ్లో మొదలయ్యే దెయ్యం ఫ్లాష్ బ్యాక్ తో సహా కొన్ని పాత్రలు ఎందుకొస్తాయి, ఎందుకు పోతాయి అస్సలు అర్థం కాదు. ఇది డైరెక్షన్ లోపమనే చెప్పాలి. సెకండాఫ్ బాగా సాగదీసినట్లు అనిపిస్తోంది. సెకండాఫ్ లో బ్రహ్మాజీ తన కామెడీతో నవ్వించడానికి ట్రై చేసిన వృధా ప్రయత్నంగానే మిగిలిపోయింది.

మొత్తంగా :

దర్శకుడిగా ప్రభాకర్ చేసిన మొదటి ప్రయత్నం ‘నెక్స్ట్ నువ్వే’ పెద్దగా సక్సెస్ అవుతుందని చెప్పలేం. బ్రహ్మాజీ కామెడీ, పర్వాలేదనిపించే ఫస్టాఫ్ ప్లస్ పాయింట్స్ గా ఉంటే.. సరైన కథ, కథనం లేకపోవడం, సీరియల్‍గా సాగదీయడం, అనవసరమైన పాత్రలు, సన్నివేశాలు ఈ సినిమాలో మైనస్ గా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘నెక్స్ట్ నువ్వే’ మూవీ కామెడీని కోరుకునే వారికి పర్వలేదు అనిపిస్తోంది.. మిగితవారికి ఆకట్టుకోదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -