ఇటీవల హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ గా చేస్తున్న దిశ కిడ్నాప్ సామూహిక అత్యాచాం, హత్య కేసు దేశాన్ని కదిలించింది. ఈ కేసులో నింధితులుగా ఉన్న నలుగురు దుర్మార్గులు ఎన్ కౌంటర్ కి గురయ్యారు. అయితే దేశంలో మాత్రం మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ శివారులోని కీసరలో మొన్న సాయంత్రం జరిగిన ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసులో భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆటో ఎక్కిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు విషయం తెలియకుండా హత్య చేయాలని భావించారు. కానీ అప్పటికే రంగంలోకి పోలీసులు ప్రవేశించడంతో ఎన్ కౌంటర్ అవుతామన్న భయంతో యువతిని చెట్ల పొదల్లో వేసి పారిపోయారట.
ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి అప్పటికే పలు నేర చరిత్ర ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కాలేజీ బస్సు దిగే బాధిత యువతి గతంలో నింధితుని ఆటో వెక్కిన సందర్భాలు ఉన్నాయట. ఆ యువతిపై కన్నేసిన నింధితుడు తన స్నేహితులతో కిడ్నాప్ చేసి అత్యాచారానికి ప్లాన్ వేశాడట. బాధితురాలు ఆటో ఎక్కిన తర్వాత స్టాపులోనే యువతి దిగాల్సి ఉండగా నిందితుడు ఆటోను ఆపకుండా యంనంపేట వైపు వేగంగా పోనిచ్చాడు.
దాంతో భయపడిన యువతి తల్లికి ఫోన్ చేసి పరిస్థితి వివరించిందట. తల్లి బంధువుల సాయంతో సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయిని ఆటోలో కిడ్నాప్ చేశారని, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ మైక్‌లో చేస్తున్న అనౌన్స్‌మెంట్ నిందితులకు వినిపించింది. ఇది విన్న నింధితులు ఆపస్మారక స్థితిలో ఉన్న యువతిని పక్కనే ఉన్న చెట్ల పొదల్లో వేసి పారిపోయారు. సెల్ సిగ్నల్ ఆధారంగా అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తల్లి నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నిన్న ఉదయం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నింధుతులకు పెద్ద నేర చరిత్రనే ఉందట. విద్యార్థినులు, ఉద్యోగాలు చేసే మహిళలను టార్గెట్ చేసుకొని కిడ్నాప్ చేసి బెదిరించి అత్యాచారాలకు పాల్పపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. తంలో మరో నలుగురు మహిళలపైనా అత్యాచారానికి తెగబడినట్టు నిందితులు అంగీకరించారు.
బోల్డ్ బ్యూటీ అరియానకు అరుదైన ఘనత
కేసిఆర్ కి హై కోర్టు పంచ్ డైలాగ్స్.. గాల్లో నడవలా..!
ఆంధ్ర ప్రదేశ్ లో ఓటు వేయకండి: ఒడిశా పోలీసులు
తమ్ముడికి భావోద్వేగ లేఖ రాసిన సుప్రీం హీరో సాయి తేజ్