Saturday, April 27, 2024
- Advertisement -

బోల్డ్ బ్యూటీ అరియానకు అరుదైన ఘనత

- Advertisement -

బిగ్‌బాస్ షోలో ముక్కుసూటిదనంతో దూసుకెళ్తూ.. టాస్క్‌ల రారాణిగా గుర్తింపు పొందిన బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ. యాంకరింగ్ కెరీర్ మొదలు పెట్టిన ఈ సన్నజాజి.. బిగ్ బాస్ రియాల్టీ షోతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపే లక్షలాది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఇక బిగ్ బాస్ తర్వాత ఈ బోల్డ్ బ్యూటీ ఫుల్ బిజీ అయిపోయింది.

వరుస ఇంటర్వ్యూలు, మాల్స్‌ ఓపెనింగ్స్‌తో పాటు పలు పార్టీలతో ఆమెకు క్షణం​ తీరిక లేకుండా పోయింది. ఏ షోలో చూసినా ఆమెనే కనిపిస్తోంది. ఇక, ఇటీవలే గోవా వెళ్లి మరీ రాంగోపాల్ వర్మను కూడా కలిసొచ్చింది. అక్కడ అవినాష్, శ్రీముఖి అండ్ టీమ్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. అంతేగాక ఓ సినిమాకు కూడా సంతకం చేసిన సంగతి తెలిసిందే. యువ హీరో రాజ్‌ తరణ్‌ కలిసి ఈ మూవీలో నటించనుంది.

ఇదిలా ఉంటే ఈ భామకు ఓ అరుదైన ఘనత దక్కింది. బిగ్‌బాస్‌ షోతో ఎంతో క్రేజ్‌ అందుకున్న ఆమె .. గూగుల్‌లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ బిగ్‌బాస్‌ తెలుగు అని టైప్‌ చేయగా అరియానా గ్లోరీ అని చూపించడం విశేషం. దీంతో తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇంతటి ఘనత దక్కిన తొలి కంటెస్టెంట్‌గా ఈ బోల్డ్ బ్యూటీ నిలిచింది. ఈ విషయాన్ని ఆమె ‘సీరియస్‌లీ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో అరియాన హాట్‌టాపిక్‌ అయిపోయింది. అయితే ఇప్పుడు గూగుల్‌ ఆమె పేరును తొలగించడం గమనార్హం.

Also Read

మేలో మెగా మేనల్లుడు సాయి తేజ్‌ పెళ్లి!

నక్క తోక తొక్కిన టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు!

త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న ప్రభాస్!

వామ్మో.. నెలలో ప్రదీప్ ఇన్ని లక్షలు సంపాదిస్తాడా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -