Friday, March 29, 2024
- Advertisement -

ఇండియాలో వసూళ్ల రికార్డులు సృష్టిస్తున్న విదేశీ సినిమా!

- Advertisement -

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ -7 ఇండియాలో హాలీవుడ్ సినిమాల వసూళ్ల రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా ఇప్పడి వరకూ ఏకంగా 40 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

డబ్బింగ్ , స్ట్రైట్ వెర్షన్లలో విడుదల అయిన ఈ సినిమా తన కలెక్షన్ల ధాటిని కొనసాగిస్తోంది. ఈ సినిమా విడుదలై ఇప్పటి వరకూ కేవలం నాలుగు రోజులే అవుతున్నాయి. దీంతో మరో నాలుగైదు రోజుల పాటు ఇదే ధాటి కొనసాగితే ఈ సినిమా ఇండియాలో అత్యధిక కలెక్షన్లను సాధించిన హాలీవుడ్ సినిమా అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్లపై ప్రదర్శితమై అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా అవతార్.  జేమ్స్ కామెరన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ ఇండియాలో దాదాపు 78 కోట్ల వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆ రికార్డును బ్రేక్ చేసేదిలా ఉంది. 

ఈ సినిమా ఇంగ్లిష్ , హిందీ, తమిళ, తెలుగు వెర్షన్లలో విడుదల అయ్యింది. దాదాపు రెండు వేల స్క్రీన్లపై ప్రదర్శితం అవుతోంది. ఓవరాల్ గా చూస్తే.. ఇది ఇండియాలోని స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లను సాధిస్తోందని చెప్పాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -