Sunday, May 5, 2024
- Advertisement -

చిరంజీవి తర్వాత తులసిరెడ్డిదే ఈ రికార్డు!

- Advertisement -

 

మెగాస్టార్ చిరంజీవి కి కడప జిల్లా రాజకీయ నేత తులసి రెడ్డికి ఒక పోలిక కనిపిస్తోంది. మరి ఏరకంగానూ సంబంధం లేని వీరి మధ్య పోలిక ఏమిటి? అంటే..

అది కాంగ్రెస్ పార్టీ లో చేరడం విషయంలో! దాదాపు ఏడాది, రెండు మూడు సంవత్సరాల చరిత్రను పరిశీలించినట్టు అయితే.. చివరి సారి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఘనుడు మెగాస్టార్ చిరంజీవే. తన పార్టీ ప్రజారాజ్యం ను విలీనం చేయడం ద్వారా మెగాస్టార్ కాంగ్రెస్ లోకి చేరిపోయాడు.

అక్కడ నుంచి చూసుకొంటూ.. వస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన వారే తప్ప.. కాంగ్రెస్ లోకి వచ్చి చేరిన వారెవరూ కనపడటం లేదు. చిరంజీవి కాంగ్రెస్ లో చేరిన తర్వాతే అధిష్టానం ఆంధ్రప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నం అయ్యింది. ఆఖరి వరకూ పదవులు అనుభవించిన వారు.. ఎలాగూ విభజనతో కాంగ్రెస్ ఏపీలో కోలుకోలేదన్న ఆలోచనతో ఆ పార్టీ ని ఖాళీ చేసి వెళ్లారు.

అలా తమ అవకాశం వాదం కొద్దీ బయటకు వెళ్లిన వారిలోకొంతమంది బాగు పడ్డారు.. మరికొందరికి ఎదురుదెబ్బలు తప్పలేదు. ఇలాంటి నేపథ్యంలో.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ అసెంబ్లీలో కనీసం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ కథ అయిపోయిందనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయిప్పటికీ.. ఇలాంటి నేపథ్యంలో తులసిరెడ్డి కాంగ్రెస్ లో చేరాడు!

గతంలో కిరణ్ వెంట వెళ్లిపోయిన ఈయన ఇప్పుడు తిరిగొచ్చాడు. కిరణ్ పార్టీ ఏమైందో ఎవరికీ తెలియకపోవడంతో తులసిరెడ్డి కాంగ్రెస్ చేరాడు. తద్వారా చిరంజీవి తర్వాత కాంగ్రెస్ లో చేరిన చెప్పుకోదగ్గ నేత అయ్యాడు. మరి ఈయన పార్టీని ఏ మేరకు ఉద్ధరిస్తాడో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -