Tuesday, April 23, 2024
- Advertisement -

జైల్లో తోటి ఖైదీల‌ను గ‌ల్స్ పాట‌ల‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ గ‌జ‌ల్‌శ్రీనివాస్‌….

- Advertisement -

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను లైంగిక వేధింపుల కేసులో జైలు జీవితం గ‌డుపుతున్నారు. శ్రీనివాస్‌ కొంతకాలంగా వేధిస్తున్నారని బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో పాటు వీడియోల‌ను అందించ‌డంతో స‌మ‌గ్ర‌విచార‌న చేప‌ట్టిన త‌ర్వాత

చంచ‌ల్‌గూడ జైల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి చెంచల్ గూడ జైలుకు పంపారు. బేయిల్ కోసం పెట్టుకున్న పిటిష‌న్‌ను కోర్టు కొట్టి వేసింది. దీంతో జైలు జీవితం గ‌డుపుతున్నారు. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన వివిధ సాంస్కృతిక సంస్థలు గజల్‌ను చీకొడుతున్నాయి. ఆయన నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో విస్తుపోతున్నారు.

ప్రస్తుతం గజల్ శ్రీనివాస్ జైల్లో కూడా గజల్స్‌‌తోనే స్వాంతన పొందుతున్నారు. జైలుకు వచ్చిన తొలి రెండు రోజుల్లో భోజనం చేయలేదట. తరువాతి రోజు నుంచి జైలు భోజనాన్ని తీసుకుంటున్నారట. జైల్లో తోటి ఖైదీలతో ఆయన కలివిడిగా ఉంటున్నారట. అంతే కాదు జైల్లోని ఖైదీలకు కూడా గజల్స్ వినిపిస్తున్నారు.

శనివారం జైలులో జరిగిన యోగా శిక్షణాశిబిరం ప్రారంభోత్సవంలో గజల్స్‌ పాడి తోటి ఖైదీలను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. జైలుకు వచ్చిన మొదటి రెండు రోజులపాటు భోజనం చేయకుండా దిగులుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -