మాటల మరాఠీ మోడీ మరో సూపర్ షాక్ ఇచ్చాడు. జనాలకు దిమ్మతిరిగేలా చేశాడు. అలాగే తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు మోడీ. దేశభక్త్స్ అని పేరెట్టుకుని ప్రజలను హింసించే నిర్ణయాలను, ప్రజలను భయాందోళనలకు గురిచేసే నిర్ణయాలను ఇప్పటికే చాలా తీసుకున్నాడు మోడీ. వెనక్కి తీసుకున్న వస్తానన్న నల్లధనం ఎక్కడ? ప్రజల అకౌంట్‌లో వేస్తానన్న నల్లధనం ఇంకా ఎందుకు రాలేదు అంటే మాత్రం మోడీ దగ్గర సమాధానం ఉండదు. ఆ విషయం పక్కనపెడితే దేశాన్ని విదేశాలకు అమ్మేసే ఒక షాకింగ్ నిర్ణయాన్ని మాత్రం మోడీ తీసేసుకున్నాడు. ఇది దేశాన్ని విదేశాలకు అమ్మేసే నిర్ణయం అని సాక్షాత్తూ మోడీనే చెప్పాడు.

కాంగ్రెస్ హయాంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్……. ఎఫ్‌డిఐ చట్టాన్ని తీసుకు వచ్చిన సందర్భం గుర్తుందా? అప్పట్లో దేశభక్త్స్ అని పేరెట్టుకున్న బిజెపి నేతలందరూ కూడా నానా హంగామా చేశారు. ఇక అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన రచ్చ కూడా అంతా ఇంతా కాదు. దేశాన్ని విదేశాలకు అమ్మేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉందని, మెజారిటీ రాజకీయ పార్టీలు ఒప్పుకోకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బ్యాక్ డోర్‌లో దేశాన్ని విదేశాలకు అమ్మేస్తుందని గొప్ప గొప్ప మాటలు చెప్పాడు మోడీ. వెంకయ్యనాయుడులాంటి మోడీ భక్త్స్ కూడా ఊగిపోయారు.
కట్ చేస్తే ఇప్పుడు నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నారు. అదే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చట్టాన్ని పూర్తిగా లిబరలైజ్ చేసేశాడు. వందశాతం ఎఫ్‌డిఐలు అన్న దిశగా సంస్కరించి పడేశాడు. మరి నాడు కాంగ్రెస్ చేసింది దేశాన్ని అమ్మడం అయితే…….ఇప్పుడు నరేంద్రమోడీ చేస్తోంది ఏంటట? నాడు మోడీ చెప్పిన మాటలే నిజమైతే ……ఇప్పుడు మోడీ చేస్తోంది అంతకంటే ఘోరం అనుకోవాలి. ఎందుకంటే ఈయన ఇప్పుడు వంద శాతం అమ్మకానికి పెట్టేశాడు మరి. నరేంద్రమోడీని చంద్రబాబు ఫాలో అవుతున్నాడో……..లేక చంద్రబాబుని నరేంద్రమోడీ ఫాలో అవుతున్నాడో తెలియదుకానీ ఇద్దరూ కూడా అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలకు……..ఇప్పుడు చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేకుండా ఉంటోంది? ఎఫ్‌డిఐలపై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మోడీ వారు చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆల్రెడీ మసకబారిపోయిన మోడీ ప్రభను పూర్తిగా చీకటి చేసేస్తున్నాయి.
