Friday, May 10, 2024
- Advertisement -

స‌వాల్‌ను ఎదుర్కోలేక టీఆర్ఎస్ పారిపోయింది ….రేవంత్ రెడ్డి

- Advertisement -

విద్యుత్ కొనుగోల్లుపై చ‌ర్చించేందుకు టీఆర్ఎస ఎంపీ బాల్క‌సుమ‌న్‌, కాంగ్ర‌స్ నేత రేవంత్ రెడ్డి మ‌ధ్య స‌వాల్లు, ప్ర‌తిస‌వాల్లు విసురుకున్న సంగ‌తి తెలిసిందే. తన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు నటించి తర్వాత… టిఆర్ఎస్ పార్టీ తోకముడిచి పారిపోయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసిఆర్ చేసిన అవినీతి బండారం బయటపడుతుందన్న భయంతోనే తోక ముడిచారని విమర్శించారు.

ఇప్పటికైనా బహిరంగ చర్చలో మాట్లాడే దమ్ము మాకు లేదు.. తోక ముడిచామని టిఆర్ఎస్ ఒప్పుకుంటే మంచిదన్నారు. 24 గంటల విద్యుత్ కొనుగోళ్లలో తాను చెప్పకుండా మిగిలిపోయిన అవినీతి బండారం మొత్తాన్ని రేపు పాత్రికేయుల స‌మావేశంలో బహిర్గతం చేస్తానని హెచ్చరించారు.

విద్యుత్ ఉత్ప‌త్తి, కొత్త ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్ల‌లో జ‌రుగుతున్న అవినీతిని మేము ఎత్తిచూప‌డంతో టీఆర్ఎస్ నేత‌లు బాల్క స‌మ‌న్‌, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, భాను ప్రసాదరావు ఆవేశంగా ఊగిపోయారు. రేవంత్ రెడ్డి చెబుతున్న‌ది త‌ప్ప‌ని తేలితే ఆయ‌న అబిడ్స్ సెంట‌ర్‌లో ముక్కును నేల‌కు రాయాలి.. అంటూ స‌వాల్ చేయ‌డం మీకు తెలిసిందే. మేము ఈ స‌వాల్‌ను స్వీక‌రించి నేను, నాతో పాటు ఎమ్మెల్యే సంప‌త్ కుమార్‌, టిపిసిసి అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్‌తో క‌లిసి 12వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు చ‌ర్చ‌కు వ‌స్తాము, మీ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు ర‌మ్మ‌న్నా, ఇంకెక్క‌డికి ర‌మ్మ‌న్నా రావ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించాము.

రేవంత్‌రెడ్డితో చర్చ‌కు సిద్ద‌మ‌న్న వారు ఈ రోజు చ‌ర్చించేదిలేదంటూ మాట మార్చేశారు. చ‌ర్చ‌లో టీఆర్ఎస్ బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే పారిపోయార‌న్నారు. శుక్ర‌వారంమ‌ధ్యాహ్నం 1 గంట‌కు గాంధీభ‌వ‌న్‌లో ప‌త్రికా విలేఖ‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హిస్తాం, వారి అవినీతి తాలూకు మరిన్ని ఆధారాల‌ను బ‌య‌ట‌పెడ‌తామ‌ని తెలియ‌జేసుకుంటున్నాము.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -