Monday, May 13, 2024
- Advertisement -

సెల్ టవర్ ఎక్కిన అమ్మాయి – ” లవర్ ని ఇచ్చి పెళ్లి చెయ్యకపోతే చచ్చిపోతా “

- Advertisement -

వివిధ రకాల డిమాండ్ లతో యువకులు సెల్ టవర్ లు ఎక్కడం చూస్తూ ఉంటాం,

ప్రత్యేక తెలంగాణా కావాలని అప్పట్లో ఎక్కితే తాజాగా ప్రత్యేక హోదా ఏపీ కి ఇవ్వాలి అని చాలా మంది ఎక్కడం చూసాం. 

వారు కోరిన డిమాండ్లు లైవ్ లో అందరికీ వినిపించడం కోసం , మీడియా ఫోకస్ కూడా సంపాదించుకోవడం కోసం చాలామంది సెల్ టవర్ లు ఎక్కుతూ ఉంటారు, కానీ ఆడవారు ఎక్కువగా ఇలా చెయ్యడం మనం ఎప్పుడూ చూడలేదు , తాజాగా వరంగల్ జిల్లా గూడూరు లో ఇవాళ ఉదయం అక్కడి లోకల్ యువతి సెల్ టవర్ ఎక్కేసింది, ప్రేమ పేరుతో తన ప్రియుడు తనని మోసం చేసాడు అని ఆరోపిస్తున్న ఆమె ఊరి పెద్దలు వచ్చి వారిద్దరికీ పెళ్లి చేస్తాం అని మాట ఇస్తే కానీ దిగను అని భీష్మించుకుని కూర్చుంది. 

ప్రేమించిన వ్యక్తి కోసమే తాను బతుకుతున్నాను అని కానీ అతనేమో తనని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు అని ఈ విషయం లో ఊరి పెద్దల్లూ, పోలీసులూ, జ్యోక్యం చేసుకుని తీరాలి అని ఆమె డిమాండ్ చేస్తోంది.

ప్రస్తుతం ఆమె ని కిందకి దింపడం కోసం పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -