విధి ఎంత విచిత్రమైనదో సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు సాక్షిగా నిలుస్తాయి.అదృష్టం ఉంటె ఆయముడుకూడా ఏమి చేయలేడంటారు పెద్దలు.నిజమే బ్రతకాలని రాసి ఉంటె ఖశ్చితంగా బ్రతుకుతారు.లేదంటె ఏరూపంలో చావు కబలిస్తుందో తెలియదు.అట్లాంటి సంఘటనే జరిగింది.
ఎవరినైనా రైలు ఢీకొడ్తే ఇంకేముంది చనిపోతారు.కాని రైలు ఢీకొట్టినా యువతి బ్రతికింది అంటె ఆశ్చర్యంగా ఉంది కదూ.
రైలు కింద పడి బతకడం అంటే వారి ఆయుష్షు గట్టిదనే చెప్పాలి. అది ఈ ఏడాది మే 13. ముంబైలోని కుర్ల రైల్వే స్టేషన్. ప్లాట్ ఫామ్ నంబర్ 7. రైలు కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు వేచి ఉన్నారు. అది లూప్ లైన్ కావడంతో ఈ లోపు ఓ గూడ్స్ రైలుకు లైన్ ఇచ్చారు. ఇంతలో 19 ఏళ్ల యువతి రెండు చెవులకూ హెడ్ ఫోన్స్ తగిలించుకుని స్నేహితుడితో మాట్లాడుకుంటూ గూడ్స్ రైలు వస్తున్న ట్రాక్ పైనే నడుస్తూ వస్తోంది. ప్రయాణికులు పెద్దగా కేకలు వేస్తూ ఆ యువతికి రైలు గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆమెకు వినిపిస్తేగా… ఆమె కూడా ఏడవ నంబర్ ప్లాట్ ఫామ్ పైకి చేరుకునేందుకే ఆ ట్రాక్ పైకి వచ్చింది.
{loadmodule mod_custom,Side Ad 1}
సడెన్ గా రైలు ను చూసి భయంతో ప్లాట్ ఫామ్ ఎక్కే ప్రయత్నం చేయబోయి సమయం లేకపోవడంతో తిరిగి ట్రాక్ అవతలి వైపుకు వెళ్లాలనుకుంది. ఇంతలో రైలు రానే వచ్చింది… ఆమెను ఢీకొని ముందుకు వెళ్లి ఆగింది. ఇంకేముంది అందరూ ఆ అమ్మాయి ప్రాణం పోయే ఉంటుందని భయపడిపోయారు.
తీరా అక్కడ చూస్తె ఆయువతి నిక్షేపంగా …సజీవంగా ఉంది. ఒక కన్నుకు మాత్రం స్వల్ప గాయమైంది. ఆమె పేరు ప్రతీక్షా నతేకర్. బంధుప్ ప్రాంత వాసి. ఫ్రెండ్ ను కలవాలని చెప్పి కుర్ల ప్రాంతానికి వచ్చి ఈ ప్రమాదం తెచ్చుకుంది. ఇదంతా స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ పై ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయింది. విధి ఎంత విచిత్రమైనదో.
{loadmodule mod_custom,Side Ad 2}
Also read