Wednesday, May 1, 2024
- Advertisement -

కుక్కపిల్లల కోసం ఎలుగుబంటితో పోరాడింది…

- Advertisement -

తన పెంపుడు కుక్క పిల్లల కోసం అమెరికాలో ఓ యువతి ఎలుగుబంటితో పోరాడింది. సాధారంగా పెంపుడు కుక్క పిల్లలు అంటే ఎవరికైనా ప్రాణమే.. కొంత మంది వాటిని ఎంతో అపురూంగ పెంచుకుంటారు. అలాంటి కుక్క పిల్లలకు ఏం జరిగినా తట్టుకోలేరు. తాజాగా ఈ అమెరికా టీనేజి అమ్మాయి తన ఇంట్లో ప్రవేశించిన ఓ పెద్ద ఎలుగుబంటి తన కుక్కపిల్లలపై దాడికి యత్నిస్తుంటే ఎవరూ ఊహించని విధంగా దానితో ధైర్యంగా పోరాడి తన కుక్క పిల్లలను రక్షించుకుంది. దీనికి సంబంధించిన వీడియో టిక్ టాక్ లోనూ, ఇతర సోషల్ మీడియా వేదికలపైనా వైరల్ అవుతోంది.

ఈ సంఘటన కాలిఫోర్నియా జరిగింది. హెయిలీ తన ఇంట్లో ఉన్న సమయంలో ఎలుగుబంటి ఆమె ఇంటి పెరటి గోడ ఎక్కింది. పెద్ద ఎలుగు బంటిని చూసి అక్కడి కుక్కలు మొరగడం మొదలు పెట్టాయి. ఎలుగుబంటి ఎంతో బలమైనది కావడంతో ఆ కుక్కలపై దాడికి దిగింది. కుక్కలు ఒక్కసారే మొరగడం చూసి 17 ఏళ్ల హెయిలీ మోరినికో అక్కడకు వచ్చింది.

తన కుక్కలపై దాడి చేయడం చూసి గోడపై ఉన్న ఎలుగుబంటిని తన చేతులతోనే ఎదుర్కొంది. ఆ ఎలుగు అవతలికి పడిపోయింది. ఇదే అదనుగా హెయిలీ తన పెంపుడు కుక్కను చేతుల్లోకి తీసుకుని అక్కడ్నించి వచ్చేసింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో మంగళవారం పోస్ట్ చేయగా.. గంటల వ్యవధిలోనే 60 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. అదే సమయంలో 8.4 మిలియన్ల లైక్స్ ఆ వీడియోకు వచ్చాయి. యువతి ధైర్యానికి నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు.

https://www.youtube.com/watch?time_continue=27&v=AK9UnY6UtN8&feature=emb_logo&ab_channel=Time4Tube

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -