- Advertisement -

48 గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులు ఈ వార్తతో బిగ్‌షాక్ త‌గ‌ల‌నుంది. సర్వర్ల సాధారణ నిర్వహణలో భాగంగా రానున్న 48 గంటల్లో డొమైన్లు ఏవీ పనిచేయవని సమాచారం. రష్యా టుడే రిపోర్ట్ ప్ర‌కారం ముఖ్యమైన డొమైన్ సర్వర్లు, దానికి సంబంధించిన నెట్ వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ కూడా కాసేపు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లకు కొంత సమయం పాటు నెట్ సదుపాయం ఉండదని పేర్కొంది.

ఇంటర్నెట్ కార్పోరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ (ఐసీఏఎన్ఎన్) మెయింటెనైన్ వర్క్ చేయనుంది. ఇంటర్నెట్ అడ్రస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్) రక్షణ కోసం క్రిఫ్టోగ్రాఫిక్ కీలో మార్పులు చేయనున్నారు. ఇటీవల పెరిగిన సైబర్ దాడుల నేపథ్యంలో హ్యాకర్లకు కౌంటర్ ఇవ్వడానికి ఈ మార్పును ఐసీఏఎన్ఎన్ చేస్తోంది. ఈ మేరకు కమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్ఏ) ఒక ప్రకటనను విడుదల చేసింది.

సురక్షితమైన డొమైన్ నేమ్ సిస్టమ్(DNS) కోసం కొంతసేపు గ్లోబల్ ఇంటర్నెట్‌ను షట్‌డౌన్ చేయకతప్పదు అని సీఆర్ఏ తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ మార్పుల కోసం ముందుగా సంసిద్ధం కాని కొన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవడైర్లకు చెందిన వినియోగదారులకు అసౌకర్యం తప్పదని వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -