Saturday, May 10, 2025
- Advertisement -

ఐటీ ఉద్యోగులు… మీకు మంచి రోజులొచ్చాయి

- Advertisement -

లేబర్ కమీషన్ అంటే ఎంత పవర్ ఫుల్లో మనం తరుచూ చూస్తూ ఉంటాం. అలాగే ట్రేడ్ యూనియన్ కూడా ఉద్యోగుల భద్రత గురించి ఆలోచించే వ్యవస్థ. మనకు తెలిసి డొమైన్ సైడ్ కంపెనీ ఉద్యోగులంతా ట్రేడ్ యూనియన్ లో భాగస్వాములవుతుంటారు. అలాగే కార్మిక సంఘాలకు ట్రేడ్ యూనియన్ కొండంత బలం. పొరభాటున సంస్థ ఏ కారణంతోనైనా ఉద్యోగిని తొలగిస్తే… ట్రేడ్ యూనియన్ జోక్యం చేసుకుని సంస్థను ప్రశ్నిస్తుంది. ఐతే ఈ అవకాశం ఇప్పటి వరకు ఐటి ఉద్యోగులకు లేదు. కాని ఇపుడు వస్తుంది.

యస్ మీరు చదువుతుంది కరెక్టే… ఐటీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫస్ట్ టైమ్ ఐటీ ఉద్యోగులు ఓ ట్రేడ్‌ యూనియన్‌గా ఏర్పడ్డారు. మన దేశంలోనే అతిపెద్ద టెక్‌ హబ్‌ అయినటువంటి… బెంగళూరు, కర్నాటక లేబర్‌ కమిషన్‌, ట్రేడ్‌ యూనియన్‌ యాక్ట్‌ 1926, కర్నాటక ట్రేడ్‌ యూనియన్స్‌ రెగ్యులేషన్స్‌ 1958 కింద కర్నాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్‌ ఉద్యోగుల యూనియన్‌(కేఐటీయూ) ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపాయి. ఇది ఐటి ఉద్యోగులకు ఎంతో ముఖ్యమైన క్షణమని, ఐటీ ఉద్యోగి యూనియన్‌కు ఇది తొలుత అంకితమిస్తున్నట్టు కేఐటీయూ జనరల్‌ సెక్రటరీ వినీత్‌ వాకిల్‌ తెలిపారు.

ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలోకి తీసుకుని యూనియన్ ఏర్పాటుచేయడం జరిగింది. ఐటీ యూనియన్‌ ఏర్పాటుతోనే వారి సమస్యలను తీర్చుతామంటున్పారు. ఒక్క బెంగళూరులోనే ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసు రంగాలలో 1.5 మిలియన్ ఉద్యోగులు ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతలేదన్నా 4 మిలియన్ల మంది ఉంటారని తెలుస్తుంది. గతేడాది నుంచి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున్న లేఆఫ్స్‌, ఎక్కువ పని గంటలు వంటి వాటిని కంపెనీలు చేపడుతున్నాయి. ఆటోమేషన్‌ దెబ్బకు కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఇంక్రిమెంట్లు తగ్గించేశాయి. అందుకే ఇలా ట్రేడ్ యూనియన్ అవతరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -