- Advertisement -
కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఒక బోగీ పక్కకు ఒరిగింది. గుంతకల్లు నుంచి సికింద్రాబాద్ వైపు బొగ్గు లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలోనే పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైల్వే ట్రాక్ బాగా దెబ్బతింది.
ప్రమాదకారణంగా పలు రైళ్లు ఆలశ్యంగా నడుస్తున్నాయి. అధికారులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.