Friday, March 29, 2024
- Advertisement -

కర్నూల్ లో హైకోర్టు.. ఇరకాటంలో జగన్ ?

- Advertisement -

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రస్తావనను పదే పదే లేవనెత్తుతూ వచ్చారు. అమరావతి ని శాసన రాజధానిగాను, విశాఖపట్నం ను కార్యనిర్వహణ రాజధానిగాను, కర్నూలు ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని భావిస్తూ వచ్చారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు వేయడంతో మూడు రాజధానుల ప్రస్తావనను కాస్త హోల్డ్ లో ఉంచారు సి‌ఎం జగన్. ఇదిలా ఉంచితే మూడు రాజధానుల ప్రస్తావనలో భాగమైన కర్నూలులో హైకోర్టు నిర్మాణం పై తాజాగా కేంద్రం స్పందించింది. ఏపీ హైకోర్టు ను అమరావతి నుంచి కర్నూలుకు తరలించడంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజూ మాట్లాడుతూ ఈ ప్రతిపాదన కేంద్రానికి అందినట్లు స్పస్టం చేశారు.

అయితే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే హైకోర్టు ఒకే నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వానికి పంపాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజూ చెప్పుకొచ్చారు. దీంతో హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడంతో ఇక జగన్ సర్కార్.. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతం హైకోర్టులో కర్నూల్ ప్రస్తావన ఒక్కటే కాకుండా మూడు రాజధానుల ప్రతిపాదన హోల్డ్ లో ఉంది.

ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదనను మాత్రమే హైకోర్టు ముందు ఉంచుతుందా ? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే జగన్ సర్కార్ మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మొదటినుంచి కూడా చెబుతూ వస్తోంది. కానీ కేంద్రప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన కాకుండా కేవలం కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు ప్రస్తావనను మాత్రమే తెరపైకి తెచ్చింది. మరి కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు విషయంలో జగన్ సర్కార్ హైకోర్టు ముందు ఎలాంటి ప్రతిపాదన పెడుతుందో చూడాలి.

Also Read

రఘురామపై హత్యాయత్నం.. చంద్రబాబు మాటల్లో అతర్యం ఏంటి ?

మోడీని దూరం పెడుతున్న పవన్ ?

మోడీ సర్కార్ పై గుర్రుగా ఉన్న వైసీపీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -