Wednesday, May 15, 2024
- Advertisement -

సమంతకు ఆమె ఇష్టమైన దర్శకుడు షాక్ ఇచ్చాడా..?!

- Advertisement -

గౌతమ్ మీనన్.. సమంతకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. తనకు హీరోయిన్ గా గొప్ప కెరీర్ ను ఇచ్చింది ఆయనే. ఏదో ఒకతమిళ సినిమాలో నటించిన సమంతను “ఏం మాయ చేశావే’ సినిమాతో స్టార్ ను చేశాడు గౌతమ్.

ఆ సినిమాతోనే సమంత లైఫే టర్న్ అయ్యింది. తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి సమంత తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా ఉంది.

ఇక అలా కెరీర్ బాగున్నా.. సమంత గౌతమ్ తో సన్నిహితంగానే ఉంది. గౌతమ్ దర్శకత్వం వహించిన వివిధ సినిమాల్లో సమంత నటిస్తూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ సమంతకు గౌతమ్ సినిమాలో చాన్స్ దక్కినట్టుగా వార్తలు వచ్చాయి. నాగచైతన్య హీరో గా నటించే ఒక సినిమాకు గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నట్టుగా.. ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు సమాచారం ఏమిటంటే.. ఆ సినిమా నుంచి సమంతను తప్పించినట్టుగా తెలుస్తోంది. ఎందుకలా అంటే.. ఆమె బిజీగా ఉండటమే దానికి కారణం అంటున్నారు. వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమంత డేట్స్ అడ్జెస్ట్ చేయలేదని గ్రహించిన గౌతమ్ ఆమెను తప్పించడానికే నిర్ణయం తీసుకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడం సమంతకు ఇష్టం లేదని కూడా తెలుస్తోంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సమంతను కాదనుకొని గౌతమ్ మీనన్ మరో హీరోయిన్ వేటలో పడ్డాడని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -