Monday, May 20, 2024
- Advertisement -

అనుచ‌రులు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది..

- Advertisement -

డేరా సచ్చా సౌదా చీఫ్‌,రాక్ స్టార్ బాబా పేరు సంపాదించిన గుర్మీత్‌ రామ్‌ రహీం పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇద్ద‌రు సాద్వినిల‌పై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేల‌డంతో సీబీఐ కోర్టు 20 సంవ‌త్స‌రాలు జైలు శిక్ష‌ను విధించింది. తీర్పు త‌ర్వాత డేరా బాబా అనుచ‌రులు ఎలాంటి విధ్వంసాలు సృష్టించారో తెలిసిందే. జైలుకు తీసుకెల్తున్న స‌మ‌యంలో గుర్మీత్‌ను త‌ప్పించేందుకు ఆయ‌న అనుచ‌రులు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది.

దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటకు గుర్మీత్‌తో పాటు వచ్చే పోలీసులపై దాడి చేసి, బాబాను అక్కడి నుంచి తప్పించి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాలని భావించారు. హరియాణా పోలీసులు బాబాను వెంటబెట్టుకుని బయటకు వచ్చారు. స్కార్పియో కారులో ఆయన్ను ఎక్కించారు. బాబాకు అటు వైపు, ఇటు వైపు భద్రతగా గార్డులు కూడా కారులో కూర్చున్నారు. కారు కోర్టు కాంప్లెక్స్‌ను దాటడానికి ఓ పోలీసు బారియర్‌ నుంచి వెళ్లాలి. అక్కడే కాపు కాశారు డేరా అనుచరులు. అనుకున్న ప్రకారం.. స్కార్పియో కారు బారియర్‌ను చేరుకునే లోపే తమ కారుతో అడ్డగించారు.

అయితే వాహ‌నంనుంచి ఆరుగురు ఆఫీసర్లు కిందకు దిగారు. సాధారణ గార్డులు దోషికి భద్రతా ఉంటార‌ని భావించిన బాబా అనుచ‌రులు వాళ్ల‌ను చూసిన వెంట‌నె దిమ్మ‌తిరిగే షాక్ తిన్నారు. కానీ ఆరుగురు ఆరి తేరిన అధికారులు తుపాకులతో కిందకు దిగడం వారికి మింగుడు పడనివ్వలేదు.

ప్లాన్ ప్ర‌కారం బాబాను త‌ప్పించాలా లేకా మెనుతిరిగి వెల్లాల‌నె అయేమ‌యంలో ఉన్నారు అనుచ‌రులు. ముందుగా అనుకున్న‌ట్లు ప్ర‌కారం వాళ్ల‌కారును ఆఫీసర్ల మీదుగా పొనివ్వాలని డ్రైవర్‌కు చెప్పారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌యి డేరా అనుచరులను అరెస్టు చేశారు. బాబాను త‌ప్పించేందుకు వేసిన ప్లాన్ గురించి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో న‌మోదు చేశారు. వారి వాహ‌నం నుంచి ఆటోమేటిక్‌ మెషీన్‌ గన్‌, పిస్టల్‌, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -