గ్రీన్ టీ..మనిషి ఆరోగ్యంగా ఉండటంలో ఎంతో సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఎందుకంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడటంతో పాటు ఉల్లాసంగా ఉండటంలో గ్రీన్ టీ పాత్ర కీలం. ప్రతి రోజు రెండు,మూడు సార్లు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందంగా ఉండవచ్చని చెబుతున్నారు నిపుణులు. ప్రతి రోజు గ్రీన్ టీ తాగితే అన్యారోగ్య సమస్యలు కూడా ఉండవు.
ఎందుకంటే ప్రతిరోజు గ్రీన్ టీ తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు లివర్ సంబంధించిన వ్యాధులను దరిచేరనీయవు. గ్రీన్ టీలో ఉండే పోషకాలు చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. బరువు తగ్గడంలో గ్రీన్ టీ పాత్ర కీలకం. గ్రీన్ టి తాగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ శాతం పెరుగుతుందని పలు పరిశోదనలు చెబుతున్నాయి.
అయితే గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అతిగా సేవిస్తే అంతే అనారోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఒకసారి కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగడం వల్ల చిరాకు, నీరసం, తిమిర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల మైగ్రేన్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి పడుకునే సమయంలో గ్రీన్ టీ తాగితే నిద్ర లేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే గ్రీన్ టీని అధికంగా సేవిస్తే తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.