Friday, April 26, 2024
- Advertisement -

వధువుపై ముద్దుల వర్షం.. షాక్​ అయిన పెళ్లి కొడుకు..!

- Advertisement -

పెళ్లి వేడుక పూర్తయ్యింది. అతిథులంతా వరసగా వచ్చి ఆశీర్వచనాలు అందజేస్తూ, బహుమానాలు ఇస్తున్నారు. ఇంతలోనే ఉన్నట్టుండి ఓ షాకింగ్​ ఘటన జరిగింది. ఓ యువకుడు నూతన జంటతో ఫొటో దిగేందుకు వచ్చాడు. ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం పెళ్లి కూతురు మీద ముద్దుల వర్షం కురిపించాడు. ఇక పెళ్లికి వచ్చిన వారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇక ఆ టైంలో పెళ్లి కొడుకు మొహంలో రంగులు మారిపోయాయి. ఇదెక్కడి విడ్డూరం అంటూ అంతా ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఈ వీడియోను షేర్​ చేశాడు. ఇంతకూ సదరు యువకుడు ఎవరు? కావాలనే ఇలా చేశాడా? అన్న విషయంపై క్లారిటీ లేదు. పెళ్లికూతురుకు తెలిసిన వ్యక్తా ? ఎందుకు అలా చేశాడు ? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. పెళ్లికొడుకును ఆటపట్టించడానికి కొంతమంది ఇలా చేశారని సమాచారం.

అయితే మరీ ఇంతలా ప్రాక్టికల్​ జోకులు వేయాలా? అన్న విమర్శ కూడా వినిపిస్తోంది. మొత్తానికి పెళ్లి వేడుక కాస్త రచ్చరచ్చగా మారింది. అయితే ఇది నిజంగా పెళ్లి వేడుకా? లేక ఏదైనా మూవీ లేదా వెబ్​ సీరిస్​ ప్రమోషన్​ కోసం ఇటువంటి వీడియోను బయటకు వదిలారా? తెలియదు కానీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

Also Read: కరోనా వ్యాక్సిన్​తో వ్యంధ్యత్వం.. నిజమెంత?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -