Friday, April 26, 2024
- Advertisement -

ఇలా చేస్తే థర్డ్ వేవ్​ రాకపోవచ్చు.. ! గులేరియా

- Advertisement -

కరోనా థర్డ్​వేవ్​ విషయంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. థర్డ్​వేవ్​ అనివార్యం అంటూ కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్​వేవ్​ చాలా భయంకరంగా ఉంటుందని.. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండొచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు. మరికొందరు మాత్రం థర్డ్​వేవ్​ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా థర్డ్​వేవ్​పై ఎయిమ్స్​ డైరెక్టర్ రణ్​దీప్​ గులేరియా స్పందించారు.

‘ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా థర్డ్ వేవ్​ రాకపోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. దీన్ని మరింత ముమ్మరం చేయాలి.అంతేకాక ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్​ తప్పకుండా ధరించాలి. భౌతికదూరం పాటించాలి. ఇలా చేస్తే థర్డ్​వేవ్​ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది. అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

Also Read: ఆల్ఫా, డేల్టా వేరియంట్​ ఏదైనా.. కోవాగ్జిన్‌ అ సూపర్​..!

కరోనా థర్డ్ వేవ్​ వచ్చినా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాక్సిన్​ డోస్​ మిక్సింగ్​పై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ విషయంపై అప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేము. వ్యాక్సిన్​ డోసు మిక్సింగ్​పై మరింత డాటా అవసరం’ అని గులేరియా పేర్కొన్నారు. దేశంలో కరోనా థర్డ్​వేవ్​ ప్రభావం ఉంటుందన్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో గులేరియా ఈ మేరకు మాట్లాడారు. ఇప్పటికే దేశంలో అక్కడక్కడా కరోనా కేసులు వస్తున్నాయి.

Also Read: కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -