Sunday, April 28, 2024
- Advertisement -

ఆడ‌పిల్ల పుట్ట‌డం పాప‌మా…?

- Advertisement -

కట్టుకున్న భార్య ఉండగానే మరో పెళ్ళి చేసుకోవడమే కాకుండా నిలదీసిన భార్యను ఒక టీఆర్ఎస్ యువజన నాయకుడు దారుణంగా కొట్టి ఇంటి నుండి గెంటివేసిన సంఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో జరిగింది … బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో పనిచేస్తున్నాడు … అయితే చందానగర్ కు చెందిన సంగీత ను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకోగా , వారికి రెండేళ్ల పాప కూడ ఉంది … భార్య ఉండగానే మరొక యువతిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడంతో పాటు , ఆడపిల్ల పుట్టిందని ఆరోపించడంతో పాటు సంగీతను దారుణంగా కొట్టి ఇంటినుండి గెంటివేసాడు … తీవ్రగాయాల పాలైన సంగీత తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు ఆందోళన చేపట్టింది … కాగా వివాదానికి కారణమైన శ్రీనివాస్ రెడ్డి ఇంటి నుండి పరారయ్యాడు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -