Saturday, May 4, 2024
- Advertisement -

ఎందుకైనా మంచిద‌ని ప‌ద్మావ‌తి సినిమా వాయిదా

- Advertisement -
  • బెదిరింపుల‌పై చిత్ర ప‌రిశ‌మ్ర మండిపాటు  
  • కేంద్రమే వాయిదా వేయించింద‌ని టాక్‌

సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం నుంచి మొద‌లైన వివాదాలు తార‌స్థాయికి చేరుకున్నాయి. ఆ చిత్రం ప్ర‌క‌టించిన నాటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఆ చిత్రం తీయొద్దంటూ బెదిరింపులే కాకుండా చిత్ర బృందానికి ప్ర‌త్య‌క్ష హెచ్చ‌రిక‌లు కూడా చేశారు. తాజాగా ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా బ‌న్సాలీ, చిత్ర క‌థ‌నాయిక దీపికా ప‌దుకొనెలను చంపితే కోట్లు ఇస్తామ‌ని ప‌లువురు ప్ర‌క‌టించారు. హర్యానా బీజేపీ చీఫ్ మీడియా కో-ఆర్డినేటర్ సూరజ్ పాల్ కూడా హీరోయిన్ దీపిక, దర్శకుడు సంజయ్ లీల బన్సాలీను త‌ల న‌రికి తెచ్చిన వారికి తప్పకుండా రూ.10 కోట్లు ఇస్తానిని ప్ర‌క‌టించారు. ఈ విధంగా ఎవ‌రినీ చూసి వారు రెచ్చిపోతున్నారో అర్థం కావ‌డం లేదు. సినిమా వాళ్ల‌ను స‌క్ర‌మంగా ప‌ని చేసుకోనివ‌డం లేదు. ఈ సినిమా విడుద‌ల చేస్తే ఏ జ‌రుగుతుందో చూడలేర‌ని ప‌లు సంఘాలు హెచ్చ‌రించారు.

ఒక‌రేమో ఏకంగా డిసెంబ‌ర్ 1వ తేదీన భార‌త్ బంద్‌కే పిలుపునిచ్చారు. దీపిక ఓ విలేక‌రుల స‌మావేశంలో ఎవ‌రెన్నీ అడ్డంకులు సృష్టించినా సినిమా ఆగ‌దని ప్ర‌క‌టించడంతో ఈ వివాదానికి ఆజ్యం పోసిన‌ట్ల‌య్యింది. పద్మావతి సినిమాపై కర్ణిసేన ఆవేశాలు హద్దులు దాటుతున్నాయి. ఇంత‌కుముందు క‌ర్ణిసేనకు చెందిన ఓ నాయ‌కుడు కేవ‌లం దీపిక ప‌దుకునేను హ‌త్య చేస్తే రూ.5 కోట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఈ విధంగా ప‌ద్మావ‌తి సినిమా విడుద‌ల కాకుండానే రూ.15 కోట్లు ప్ర‌క‌ట‌న‌ల‌తో ఈ చిత్రం విజ‌యం సాధించింది. విడుద‌ల కాకుండానే ఈ సినిమా విజ‌యం సాధించిన మాదిరిగా మ‌నం భావించ‌వ‌చ్చు.

వీట‌న్నిటి నేప‌థ్యంలో సినిమా విడుద‌లను వాయిదా వేస్తున్న‌ట్లు ప‌ద్మావ‌తి చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే ఈ వాయిదాల వెనుకే ఎన్నో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఈ సినిమాను వాయిదా వేయించింద‌ని స‌మాచారం. ఇప్పుడు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ ఎన్నిక‌లు ఉండ‌డంతో ఎందుకైనా మంచిద‌ని వాయిదా వేయించింద‌ని టాక్‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ యోగి ప్రభుత్వం కూడా ఈ సినిమా ఈ సమయంలో విడుద‌లపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. ఎలా అయినా ఈ సినిమా వాయిదా ప‌డ‌డంపై అభిమానుల‌కు నిరాశ మిగుల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -