Saturday, April 27, 2024
- Advertisement -

ఇద్దరు పోలీసులు కొట్టుకుంటే ఏం అవుతుంది..!

- Advertisement -

ఝార్ఖండ్​లో ఓ పోలీసు​పై, ట్రాఫిక్​ అధికారి దురుసుగా ప్రవర్తించారు. హెల్మెట్​ ధరించలేదనే కారణంగా ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి దాడి చేసుకునే వరకు వెళ్లింది. ట్రాఫిక్​ సిబ్బంది ఆగ్రహంతో ఊగిపోయి.. పోలీసుపై చెయిచేసుకున్నారు. ఈ సంఘటనకు బంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

రాంచీలోని సహజానంద్​ చౌక్​ సమీపంలో ఓ పోలీస్ శిరస్త్రాణం ధరించకుండా బైక్​పై వెళ్తున్నారు. ఇది గమనించిన అక్కడి ట్రాఫిక్​ పోలీస్​.. ఆయన వాహనాన్ని ఆపి జరిమానా విధించారు. దానికి పోలీస్ అధికారి​ నిరాకరించారు. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించారు.

ఇంతలో ట్రాఫిక్​ పోలీసు ఆయన్ను వెంబడించి నడిరోడ్డుపైనే దాడి చేశారు.ఈ దృశ్యాలు వైరల్​ అవడం వల్ల.. విషయం ఉన్నతాధికారులకు చేరింది. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్​ తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేపట్టామన్న ఆయన.. దోషులెవరో తేల్చి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మళ్లీ తెలంగాణ కి మూడింది.. మూడు వేలు కేసులు..!

దేశంలో కరోనా డేంజర్ బెల్.. 2 లక్షల కొత్త కేసులు!

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -