Friday, April 26, 2024
- Advertisement -

దేశంలో కరోనా డేంజర్ బెల్.. 2 లక్షల కొత్త కేసులు!

- Advertisement -

ఇండియాలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తుంది. గత ఏడాది ఇదే సమయానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి అలాంటి దుస్థితి నెలకొంటుంది. కాకపోతే కరోనా వ్యాక్సిన్ వచ్చింది.. వైరస్ ని ఎదిరించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలని అని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

గడచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 2,00,739 కాగా, 1,037 మంది వైరస్ కారణంగా మరణించారు. కొత్త కేసుల్లో 58,952 కేసులు మహారాష్ట్రలో, ఢిల్లీలో 17,282 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్ తో 1,73,123 మంది మృతి చెందారు. దేశంలో తొలిసారి 2 లక్షల కరోనా కేసులు దాటడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా, నిన్న పరీక్షించిన 13,84,549 నమూనాలతో సహా 2021 ఏప్రిల్ 14 వరకు కోసం 26,20,03,415 నమూనాలను పరీక్షించినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడంతో పాటు, 12వ తరగతి పరీక్షలను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల…

వైఎస్‌ షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరా కామెంట్స్..!

ఏపి కి భారీ రెడ్ అలెర్ట్.. భారీగా కేసులు నమోదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -