Saturday, April 20, 2024
- Advertisement -

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల…

- Advertisement -

తెలంగాణ లో రాజన్న పాలన తీసుకు వస్తా అని శపథం చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తాజాగా సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ వస్తే దళిత వ్యక్తిని తొలి సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్… ఆ తర్వాత దళితులను మోసం చేశారని విమర్శించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం లోటస్ పాండ్‌లో ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో షర్మిల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూమి ఏమైందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవెళ్లకి దివంగత వైఎస్సార్ అంబేడ్కర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును కేసీఆర్ ఎందుకు పెట్టలేక పోయారని ప్రశ్నించారు. మరోవైపు, రేపు షర్మిల నిరాహారదీక్షను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే.

దళిత సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ సీఎం రాజయ్యపై ఒక్క ఆరోపణ వచ్చిన వెంటనే ఆయనను కేసీఆర్ పదవి నుంచి తొలగించారని షర్మిల అన్నారు. గత కొన్ని రోజులుగా మంత్రి మల్లారెడ్డిపై ఎన్నో ఆరోపణలు వస్తున్నప్పటికీ కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో నిర్వహించే సభకు కొవిడ్ నిబంధనలు అడ్డు రావని.. అంబేద్కర్ జయంతి ఘనంగా చేయడానికి మాత్రం నిబంధనలు అడ్డు వస్తాయా? అని ప్రశ్నించారు. 

ఏపి కి భారీ రెడ్ అలెర్ట్.. భారీగా కేసులు నమోదు..!

మరీ ఇంతపాపమా.. కోడలు ఉరి వేసుకుంటె.. అత్తమామలు అది చేశారు!

ప్రపంచంలో ఎక్కడలేని అంత పెద్దది ఇక్కడే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -