Sunday, May 12, 2024
- Advertisement -

కాలేజీ గర్ల్స్ కి డ్రగ్స్ ఇచ్చి వీడియో షూట్.. తర్వాత వ్యభిచారం..!

- Advertisement -

కాలేజీ అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి వారికి కూల్ డ్రింక్స్ తో మత్తు డ్రగ్స్ ఇచ్చి.. నగ్నంగా వీడియోలు తీసి.. వాటిని మళ్లీ వారికే చూపించి బ్లాక్ మెయిల్ చేయించి హైటెక్ వ్యభిచారం నిర్వహించారు. ఈ దందాలో కేవలం కాలేజ్ అమ్మాయిలే కాదు.. స్కూల్ విద్యార్ధినులు కూడా ఉన్నారు. ఇంత మంది జీవితాలను పాడు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో కాలేజీ అమ్మాయిలు కుటుంబసభ్యులు షాక్ అయ్యారు.

తమిళనాడులోని ముధురైలో ఫేమస్ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు హైటెక్ ముఠాకి చిక్కి బలయ్యారు. ఓ విద్యార్ధికి మొదట పోర్న్ ఎస్ఎంఎస్ లు, వీడియోలు వచ్చాయి. దీనిపై ఫోన్ చేస్తే మీకు కావలసినంత డబ్బులు బంగారం నగలు ఇస్తామని.. మేము చెప్పినట్లు వ్యభిచారం చేయాలని ఓ విద్యార్ధినికి ముఠా సభ్యులు ఎరవేశారు. ఆ కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి ఫోన్ నంబర్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. తల్లాకుళంలోని విలాసవంతమైన ప్రైవేట్ రెస్టారెంట్ ను బేస్ చేసుకొని.. అమ్మాయిలకు వలవేసి లొంగదీసుకొని ఈ హైటెక్ వ్యభిచారం కేంద్రం నిర్వహించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

అమ్మాయిలకు ఇలా ఫోన్ చేసి నమ్మించి.. తర్వాత బాగా డబ్బులిచ్చి విహారయాత్రలకు తీసుకెళ్తారు. అక్కడ మత్తు డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ ఇచ్చి పోర్న్ వీడియోలు తీస్తారు. మేం చెప్పినట్లు చేయకపోతే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలా కాలేజీ హైస్కూల్ విద్యార్థినులతో హైటెక్ వ్యభిచారం కొద్దిరోజులుగా చేస్తున్నట్టు విచారణలో తెలిసింది. ప్రధానంగా కాలేజీ హాస్టల్ విద్యార్ధులకు వల వేసి వారికి రోజు బిర్యానీలు, బీర్లు పంపిస్తూ మిగతా వారిని ఆకర్శించారు.

వినని వారిపై అత్యాచారం చేయించి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయించి ఈ హైటెక్ వ్యభిచారం చేయించారు. చాలా మంది కాలేజీ అమ్మాయిలు భారీగా డబ్బు విలాసవంతమైన జీవితం కోసం దిగజారిపోయి ఇలా వ్యభిచార కూపంలో చిక్కుకుపోయారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. మూడేళ్ల నుంచి కాలేజీ అమ్మాయిలతో ఈ దందా సాగుతున్నట్టు తెలిసింది. పదే పదే లాక్ డౌన్ టైంలో కాలేజీ విద్యార్ధినులు రెస్టారెంట్ కు వెళ్లి వస్తుండడంతో పోలీసులకు ఈ షాకింగ్ నిజం తెలిసింది. దాంతో ఆ ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -