Monday, May 6, 2024
- Advertisement -

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో వెయ్యి మంది కాపాడిన పబ్జీ గేమ్..!

- Advertisement -

ఇప్పుడు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేకుంటే కాలం గడిచే పరిస్థితి లేదు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో అనేకరకాల గేమ్స్ ఆడుతున్నారు. అందులో ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన గేమ్ పబ్జీ గేమ్. ముఖ్యంగా యువత ఈ గేమ్ బాగా ఆడుతున్నారు. పిల్లలు, పెద్దలు కూడా ఈ గేమ్ కి అడక్ట్ అవుతున్నారు.

ఈ పబ్జీ వల్ల కాపురాలను కూడా కొందరు కూల్చుకున్నారు. ఇక ఫోన్ లేని పిల్లలు పబ్జీ ఆడేందుకు కొత్త ఫోన్ కావాలని తల్లిదండ్రుల విసిగిస్తున్న సందర్భాలు చూస్తునే ఉన్నాం. అయితే పెనుప్రమాదంలో చిక్కుకున్న వందలమందిని కాపాడింది ఇప్పుడు ఈ పబ్జీ గేమ్. తాజాగా, విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించింది. విషయంలోకి వెళ్తే.. అర్దరాత్రి సమయంలో అందరు నిద్రలో ఉన్నారు. పలకరించిన లేచే సమయం కాదు అది. ఏం జరిగిందో అర్దమయ్యే లోపే చాలా మంది సృహ తప్పి పడిపోయారు.

అటువంటి టైంలో ఓ యువకుడు ఫోన్ లో పబ్జీ ఆడుతున్నాడు. మెలకువగా ఉండడంతో వాసన గుర్తించిన నీలావు కిరణ్.. స్నేహితులతో పాటు కుటుంబసభ్యులకు సమాచారమందించాడు. కిరణ్ ఫోన్‌ రావడంతో అప్రమత్తమైన అతని స్నేహితులు.. సంతోష్, సురేష్ ఇళ్లలో నిద్రపోతున్న వాళ్లందరినీ లేపారు. పరుగులు తీస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. దాంతో మేలుకున వందల మంది విషవాయువుల కాటు నుంచి తప్పించుకున్నారు. మరోవైపు.. స్నేహితులను అప్రమత్తం చేసిన కిరణ్.. తన ఫ్యామిలీతో పారిపోలేదు. ధైర్యంగా ఊరిలో తెలివి తప్పి పడిపోయిన వారిని తరలించేందుకు కష్టపడ్డాడు. పబ్జీ వల్ల ఆ టైంలో కిరణ్ మెలకువ గా ఉండటం వల్లే చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు వెయ్యి మంది ప్రాణాలు పబ్జీ కాపాడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -