Thursday, May 9, 2024
- Advertisement -

రేవంత్ ఇంటి వ‌ద్ద హై టెన్స‌న్‌..

- Advertisement -

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు గురువారం నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు కార్య‌క‌ర్త‌లు, అనుచ‌ర‌లు భారీగా చేరుకోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త వాతావార‌ణం నెల‌కొంది. మా నాయ‌కున్ని చూపించాలంటూ ఆయ‌న అనుచ‌రులు డిమాండ్ చేయ‌డంతో హైటెన్స‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

అనుచరుల ఒత్తిడి నేపథ్యంలో విచారణ మధ్యలో ఉన్న రేవంత్ ను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. తన అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేసిన రేవంత్ ను తిరిగి లోపలికి తీసుకెళ్లారు. భారీగా చేరుకున్న కార్య‌క‌ర్త‌ల‌ను అదుపు చేయడం కోసం రేవంత్ నివాసం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. దీంతో రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేస్తారని ప్రచారం జరగడంతో.. తాము అరెస్టు చేయడానకి రాలేదని కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -