Saturday, May 11, 2024
- Advertisement -

కేసీఆర్ మనవడి ఫెవరేట్ హీరో ఎవరో తెలుసా..?

- Advertisement -
Himansh Favourite Hero KCR

హైదరాబాద్ లో ఐఫా ఫిల్మ్ -2017 అవార్డ్స్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయితే ఈ వేడుకలకు సినిమా పరిశ్రమకు చెందిన, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులంతా హాజరయ్యాడు. అయితే ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల మనవడు హిమాన్ష్ కూడా పాల్గన్నారు. హిమాన్ష్ ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

అయితే సినీ తారలను స్క్రీన్ పై అందరు చూస్తారు. కానీ వారిని తెరపైన కంటే రియల్ గా చూడటమే తనకు ఇష్టమని, అందుకే ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పుకొచ్చాడు హిమాన్ష్. గతేడాది వేడుకల్లోనూ పాల్గొన్నప్పటికీ ఎక్కడో చివర కూర్చున్నానని, కానీ ఈసారి ముందు వరుసలో వున్నానని తెలిపాడు. అయితే ఈ మధ్య కాలంలో హిమాన్ష్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీడియా కూడా అతనిపై ప్రత్యేక దృష్టి సారించింది.

హిమాన్ష్ ను మీడియా మీకు నచ్చిన హీరో, హీరోయిన్ ఎవరని అడిగింది. దీనికి జవాబుగా హిమాన్ష్ నాకు ఏ హీరో, హీరోయిన్ కాని ఫేవరేట్ కాదు. మా తాత గారే నాకు రియల్ హీరో అని ఒక్క మాటలో చెప్పి అందరిని ఆశ్చర్యంలోకి ముంచెత్తాడు. తాత రోజూ రాత్రి తనతో ఉంటారని, ఇద్దరం కలిసి సినిమాలు చూస్తామని, కథలు చెబుతారని వెల్లడించిన హిమన్షు.. రీసెంట్‌గా తన ఫాదర్ (కేటీఆర్)తో కలిసి కాటమరాయుడు చూశానని తెలియజేశాడు. 

{youtube}pxyDkIMdr80{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -