Monday, May 5, 2025
- Advertisement -

మహేశ్ కత్తిపై హిందువుల బ్రహ్మాస్త్రం… ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లు సస్పెండ్ !

- Advertisement -

రాముడితో రామభక్తులతో పెట్టుకున్న కత్తి మహేశ్ పని మటాషే.. అని కొందరు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన అతడిని తెలంగాణ పోలీసులు శిక్షించకపోయినా తాము ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మతఘర్షణలు చెలరేగేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడిన కత్తి మహేశ్ కు కేవలం నగర బహిష్కరణ చాలదని హిందూ సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. రామాయణం, రాముడు, సీతాదేవి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి, దేశద్రోహానికి పాల్పడిన అతడిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోకపోయినా తాము మాత్రం విడిచిపెట్టేది లేదంటున్నారు. ఏ సోషల్ మీడియా ద్వారా అయితే పాపులర్ అయ్యాడో అదే సోషల్ మీడియా ద్వారానే కత్తి మహేశ్ కెరీర్ కు ముగింపు పలుకుతామంటున్నారు శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామితో పాటు పలువురు హిందువులు. ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా సంచలనం, ప్రచారం కోసమే పైశాచిక ఆనందంతో కత్తి వివాదాస్పద కామెంట్లు పోస్టు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ట్విట్టర్, ఫేస్ బుక్ యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న అతడి అకౌంట్లను తక్షణమే బ్లాక్ చేయాలని కోరుతున్నామని వివరించారు. అసలు కత్తి మహేశ్ ను తాము ఓ మనిషిలా గుర్తించడం లేదని, అతడి చర్యలు జంతువు కంటే హీనంగా ఉన్నాయని విజయవాడలోని పలు అర్చక సంఘాలు మండిపడ్డాయి. వ్యక్తిగత ప్రచారం కోసం వ్యవస్థలో కల్లోలం సృష్టించే వారిని సమాజం దూరంగా పెట్టాలని కోరుతున్నారు. అందుకే తాము ట్విట్టర్, ఫేస్ బుక్ యాజమాన్యాలకు లేఖ రాస్తున్నట్లు తెలిపారు.

గతంలో కత్తి మహేశ్ లాగానే బాలీవుడ్ క్రిటిక్ అని చెప్పుకునే కమల్ రషీద్ ఖాన్. అలియాస్ కేఆర్కే పరిస్థితి ఇప్పుడు ఏంటో ఓ సారి కత్తి మహేశ్ లాంటి వాళ్లు గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. రివ్యూల పేరుతో సినిమాల మీద పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసి, ఆయా నటీనటుల మీద అభ్యంతరకర రీతిలో కేఆర్కే కామెంట్లు చేసేవాడు. బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాలు సైతం ఫ్లాప్ అంటూ తన రివ్యూల్లో రాసుకొచ్చేవాడంటనే కేఆర్కే స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అలానే బాలీవుడ్ హీరోలందరినీ టార్గెట్ చేసి, వారి సినిమాలు ఇలా విడుదల అయీ అవగానే రివ్యూల పేరుతో నెగిటివ్ టాక్ సృష్టించేవాడు. ఇతగాడికి ట్విట్టర్, ఫేస్ బుక్ లో లక్షలాది ఫాలోవర్స్ ఉండటంతో ఆయన రివ్యూల ప్రభావం ఆ సినిమాల మీద పడేది. అల్లు అర్జున్ నీ వదల్లేదు. ఈ లుక్కా లుకింగ్ ఆలూ టాలీవుడ్ లో పెద్ద స్టార్ అంట. బాలీవుడ్ కి వస్తే జూనియర్ ఆర్టిస్టుగా కూడా పనికిరాడు అంటూ ఎగతాళి చేస్తూ ట్వీటాడు. అమీర్ ఖాన్ సినిమా సీక్రెట్ సూపర్ స్టార్ పరమ చెత్తగా ఉంది. అట్టర్ ఫ్లాప్ అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశాడు. అయితే సినిమా సంగతి ఎలా ఉన్నా, ఇండియాలో రిలీజ్ కాకముందే విదేశాల్లో విడుదలైన సినిమాను చూసి తాను రివ్యూ రాసినట్లుగా చెప్పుకొచ్చాడు కేఆర్కే. దీంతో ఆ రివ్యూ ప్రభావం భారత్ లో కనిపిచింది. అమీర్ సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో ఒళ్లుమండిన అమీర్ ఖాన్ ఫ్యాన్సు, ఇతగాడి ఆగడాలు భరించలేకపోతున్నామని, ట్విట్టర్ లో రివ్యూల పేరుతో పిచ్చిపిచ్చి రాతలు రాసి, తమ హీరోలను, దర్శక నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నాడని ట్విట్టర్, ఫేస్ బుక్ సహా యూ ట్యూబ్ యాజమాన్యాయనికి ఫిర్యాదు చేశారు. వెంటనే అతడి అకౌంట్లను సస్పెండ్ చేయాలని విన్నవించుకున్నారు. అమీర్ ఫ్యాన్సు వినతిని పరిశీలించిన ట్విట్టర్ వెంటనే చురుగ్గా స్పందించింది. కేఆర్కే ట్విట్టర్ అకోంట్ ను సస్పెండ్ చేసేసింది. దీంతో సోషల్ మీడియాలో అతగాడి అడ్రస్ కనుమరుగైపోయింది. అమీర్ ఖానే తనపై కక్షగట్టి ఇలా చేయించాడని, ఎంతో కష్టపడి, ఖర్చుపెట్టి సంపాదించుకున్న ఫాలోవర్స్ ఒక్కరాత్రిలో దూరమైపోయారని ఈ క్రిటిక్ తలబాదుకున్నాడు. తనకు తీవ్ర నష్టం జరిగిందని లబోదిబోమన్నాడు.

ఇప్పుడు కత్తి మహేశ్ పైనా అలాంటి ఫిర్యాదులే చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ధార్మిక సంఘాలు, భజరంగ్ దళ్, విశ్వహిందూపరిషత్, బ్రాహ్మణసంఘాలు యోచిస్తున్నాయి. ఓ నగరం నుంచి బహిష్కరించడం కాదు సోషల్ మీడియా నుంచి, సమాజం నుంచి బహిష్కరించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ చానెల్ యాజమాన్యాలకు పెద్దసంఖ్యలో ఫిర్యాదులు చేసి కత్తి మహేశ్ అకౌంట్లను సస్పెండ్ చేయాలని కోరనున్నాయి. అదే జరిగితే ఆయన అకౌంట్లు సస్పెండ్ చేస్తే నిజంగా కత్తి మహేశ్ కు కోలుకోలేని దెబ్బే. ఏ సోషల్ మీడియా ద్వారా అయితే ఫ్రీ పబ్లిసిటీ పొంది పాపులర్ అయ్యాడో…ఇప్పుడు అదే సోషల్ మీడియా నుంచి బహిష్కరణకు గురైంతే ఇక కత్తి మహేశ్ ఓ గతమే. ఆయన ఉనికి ప్రశ్నార్థకమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -