కత్తి మహేశ్​కు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం

సినీ విమర్శకుడు కత్తి మహేశ్​ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆయన కళ్లకు తీవ్ర గాయాలైనట్టు డాక్టర్లు చెప్పారు. నెల్లూరు, చెన్నై ప్రధాన రహదారిలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కత్తి మహేశ్​ సీటు బెల్ట్​ పెట్టుకోకపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కత్తి మహేశ్​కు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.

అయితే ఆయన వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షల ఆర్థిక సాయం చేసింది. సీఎం రిలీఫ్​ ఫండ్​ కింద ఈ సాయం చేసినట్టు సమాచారం.ప్రముఖ నటుడు పవన్​ కల్యాణ్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో కత్తి మహేశ్​ పాపులర్​ అయ్యారు. నిరంతరం ఫేస్​బుక్​లో యాక్టివ్​గా ఉండే కత్తి మహేశ్​.. హిందూ దేవుళ్లు, హిందూ సంప్రదాయాలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటాడు. దీంతో ఆయనకు పవన్​ కల్యాణ్​ ఫ్యాన్స్​, ఇటు హిందూ వాదుల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటుంది.

Also Read: శనగలు నానబెట్టిన నీటిని పడేస్తున్నారా.. అయితే ఈ పోషకాలు కోల్పోయినట్లే?

ఇక ఇటీవల ప్రమాదానికి గురైన సందర్భంలో నెటిజన్స్ కత్తి మహేశ్​కు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు. దీంతో అలాంటి వారిపై విమర్శలు వచ్చాయి. ఓ మనిషి చావు బతుకులో ఉన్నప్పుడు పైశాచిక ఆనందం పొందడం సరికాదని కొందరు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షలు ఆర్థిక సాయం చేయడం గమనార్హం.

Also Read: ఆల్ఫా, డేల్టా వేరియంట్​ ఏదైనా.. కోవాగ్జిన్‌ అ సూపర్​..!

Related Articles

Most Populer

Recent Posts