లోకనాయకుడు కమల్ హాసన్ పాలిటిక్స్ లోకి వచ్చాక… టోటల్ చేంజ్ అయిపోయాడు. ఓటు బ్యాంక్ కోసం తెగించిన రాజకీయ నాయకుడు ఏమేం చేస్తాడో అవన్నీ కమల్ చేసేస్తున్నాడు. కేరళ వెళ్లి ఎప్పుడైతే కమ్యునిస్టుల చెంతకు చేరి… వారి మద్దతు తీసుకున్నాడో అప్పుడే కమల్ వైఖరి చాలామందికి అర్ధమైపోయింది. చెన్నైలో ఓటింగ్ ను శాసించే… క్రిస్టియన్లు, ముస్లీమ్ ల వర్గాలకు దగ్గరవుదామనే తలంపుతో ఇలా అవాకులు చెవాకులు పేలుతున్నాడని అందరికీ అర్ధమైంది.
దీనికి తోడు తాజాగా కమల్ ఈ దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు కూడా సామాన్యమైనవి కావు. దీనిపై హిందుత్వ సంస్థలు మండిపడుతున్నాయి. అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు పండిత్ అశోక్ శర్మ ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ కమల్, ఆయనకు వంతపాడేవాళ్లని కాల్చిచంపాలని లేదా ఉరి తీయాలన్నారు.
హిందూ ధర్మం పట్ల విశ్వాసాల పట్ల నమ్మకమున్న ప్రతీవారు దీనిపై స్పందించాలని ఆయన కోరారు. ఈ పవిత్ర దేశంలో నివశిస్తున్నవారికి ఇలాంటి భావజాలం వుండటానికి ఏమాత్రం వీల్లేదన్నారు. ఇకపై కమల్ నటించే సినిమాలను అభిమానులు బాయ్ కాట్ చేయాలని మరో ముఖ్య వ్యక్తి… అభిషేక్ అగర్వాల్ డిమాండ్ చేశారు. హిందువులను, హిందూ మతాన్ని అవమానించేవారిని క్షమించే ప్రసక్తేలేదన్నారు. ఇటు కమల్ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కమల్ ఎక్కడా తగ్గకపోవడం కమల్ లోని మరో కంచె ఐలయ్య బయటకు వచ్చాడనే విషయం స్పష్టంగా అర్ధమవుతుందంటున్నారు తెలుగు సోషల్ మీడియా జనాలు.