Friday, May 10, 2024
- Advertisement -

షాకింగ్… పూర్తిగా హిందువుగా మారిపోయిన జగన్

- Advertisement -

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌కి తెలుగు ప్రజలు ఓట్లు వేయకుండా చేయడం కోసం చంద్రబాబుతో పాటు ఆయన భజన మీడియా మొత్తం కూడా అన్నిరకాల ప్రయత్నాలూ చేసింది. వైఎస్‌లపై విషం కక్కడం కోసం ఎన్ని రకాలుగా దిగజారాలో అన్ని రకాలుగానూ దిగజారారు. రాజకీయంగా, జర్నలిజం పరంగా అన్ని విలువలూ వదిలేసి వైఎస్‌లను రాక్షసులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎల్లో గ్యాంగ్ మొత్తం వైఎస్‌ల పై చేసిన విష ప్రచారాల్లో ఒకటి హిందువులందరినీ క్రిష్టియన్స్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నది. బూట్లు వేసుకుని కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు, పూజలు చేసిన చంద్రబాబు మాత్రం హిందూ జనోద్ధారకుడు. రీసెంట్‌గా కూడా విజయవాడలో ఎన్నో హిందూ దేవాలయాలను పూర్తిగా కూలగొట్టించాడు చంద్రబాబు. ఇక టిటిడిలో అవినీతిపరులకు పెద్ద పీట వేశాడు. క్రిష్టియన్ సభలకు వెళ్ళేవాళ్ళకు టిటిడి ఛైర్మన్ ఇవ్వజూశాడు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం హిందూ మత ఉద్ధారకుడే అని ఎల్లో మీడియా చెప్తూ ఉంటుంది.

వైఎస్ జగన్ పట్టు వస్త్రాలతో సాంప్రదాయ బద్ధంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా సరే టిడిపి అండ్ ఆ పార్టీ భజన మీడియా బ్యాచ్ మొత్తం నానా యాగీ చేస్తుంది. అలాంటి విష ప్రచారం 2014 ఎన్నికల్లో కొంతవరకూ ఫలించింది అన్న మాట వాస్తవం. ఆ వాస్తవం తెలుసుకున్న తర్వాతే జగన్ కూడా గుళ్ళూ గోపురాలు తిరుగుతూ ఉన్నాడని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటున్నారు. హిందూ ఓట్ల కోసమే జగన్ చినజీయర్ స్వామి పాదాలకు మొక్కడం లాంటివి చేస్తున్నాడని ఎల్లో మీడియాతో పాటు టిడిపి నాయకులందరూ విమర్శలు చేశారు. అదేంటో మరి… జగన్ క్రిష్టియానిటీని పాపులర్ చేస్తున్నాడనీ వీ్ళ్ళే నిందలు వేస్తారు….. మరోవైపు హిందూ దేవుళ్ళకు మొక్కినా, హిందూ స్వాములకు పాదాభివందనం చేసినా విమర్శలతో విరుచుకుపడిపోతూ ఉంటారు.

ఎల్లో మీడియా ప్రచారం విషయం పక్కన పెడితే గత కొంత కాలంగా వైఎస్ జగన్ పూర్తిగా హిందూ మతాన్ని నమ్ముతున్నాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తాజాగా పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న ఒక సంఘటన కూడా ఆ విషయాన్ని నిరూపిస్తోంది. పాదయాత్రకు ముందు తిరుమలను దర్శించుకోవడం పొలిటికల్ స్టంట్ అనుకున్నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అడుగు కూడా శుభ ముహూర్తాల ఆధారంగా వేస్తున్నాడు జగన్. కడపలో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ సోమవారం రాత్రి కర్నూలు జిల్లా చాగలమర్రిలో బస చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే హిందూ పండితులు కొత్త జిల్లాలో అడుగుపెట్టడానికి ఇప్పుడు ముహూర్తం బాగాలేదని చెప్పడంతో కడప జిల్లా సరిహద్దులో ఎస్ ఎస్ ధాబాలో బస చేశాడు జగన్. ఈ విషయం గురించే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. క్రిష్టియన్ మతాన్ని విశ్వసించే వ్యక్తి అయినప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి హిందూ మతవిశ్వాసాలను కూడా నమ్మేవాడు. అలాగే అర్చకులకు ప్రభుత్వ జీతాలు ఇవ్వడంతో పాటు ధూప దీప నైవేద్యం పథకం కూడా ప్రవేశ పెట్టి దేవాలయాలను కాపాడాడు వైఎష్. ఇప్పుడు జగన్ కూడా పూర్తిగా హిందూ మత విశ్వాసాలను నమ్ముతున్నాడని తాజా సంఘటన ఆధారంగా పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -