Friday, May 9, 2025
- Advertisement -

ఇంత ఆస్తితో ఎలా బతుకుతారో పాపం!

- Advertisement -

లోకేష్ ప్రకటించిన ఆస్తుల చిట్టా చూసి ఎల్లో శ్రేణులు ఒకింత బాధను వ్యక్తం చేశాయట.ఎందుకంటే తమ నాయకుడు ఇంత తక్కువ ఆస్తితో పార్టీని ఎలా నడుపుతుంది వారికి అర్ధం కావడం లేదట.

ఏదో ఫండ్స్ తో నడిపించేస్తున్నారు గాని …తమ లోకేష్ బాబుకు ఎంత కష్టమొచ్చిందో నని కొందరు తెగ ఫీలైపోతున్నారట.మరిదే ఎటకారమంటే.లేక పోతే ఏంటి చెప్పండి.ఈసారైన ఆస్తులను కాస్త పెంచుతాడనుకున్న లోకేష్ ఈసారి కూడా అభిమానులను నిరాశ పరిచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.వరుసగా ఐడో ఏడాది కూడా తమ కుటుంబ ఆస్తుల వివరాలను తనకు అచ్చొచ్చిందని ఫీలౌతోన్న ట్విట్టర్ తో పాటు తమ మీడియా ముందుంచాడు.  

ఆస్తి వివరాలతో పాటు పెద్ద పెద్ద డైలాగ్ లైన విశ్వసనీయత, పారదర్శకతలను వాడేశాడు.వీటిని  తమ కుటుంబం పాటిస్తుందని అందులో పేర్కొన్నాడు. లోకేష్  ఇచ్చిన చిట్టా ప్రకటన ప్రకారం చూస్తే…వారి కుటుంభ  ఆస్తుల విలువ ఇలా ఉంది. తనకు 12.39కోట్లు ఆస్తి ఉండగా(అందుల్లో అప్పులు 4.72కోట్లు). అలాగే చంద్రబాబు నాయుడుకు కేవలం 50లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయట. (ఇందుల్లో ఓ 8లక్షలు  అప్పులుకూడా ఉన్నాయి).ఇక లోకేష్ అమ్మగారు చంద్రబాబు సతీమణిగారైనటువంటి భువనేశ్వరికి 43.20కోట్ల ఆస్తులుండగా దానిలో అప్పులు 10.12కోట్లు చూపించారు. లోకేష్ భార్య బ్రహ్మణికి 5.14కోట్ల ఆస్తులుండగా అందుల్లో అప్పులు 0.36కోట్లు ఉన్నాయట.

 ఇక నిర్వాణ హోల్డింగ్స్ పేరుతో తమ కుటుంబ సభ్యులున్న సంస్థకు 27.18 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందుల్లో కూడా 26.44కోట్ల అప్పులను చూపించారు. ఇదంతా తనకు ట్విట్టర్లో 84.8వేలమంది ఫాలోవర్స్ కు తెలియజేసేలా ఓ పిఎన్ జి పైల్ ను కూడా పెట్టేశాడు. మరి ఇంత తక్కువ ఆస్తితో లోకేష్ బాబు భవిష్యత్ తో పార్టీ ఆఫీస్ ను ఎలా నడిపిస్తాడంటారు.మరి అప్పుడు కూడా విరాళాలతోనే పార్టీని నడిపిస్తాడనుకోవాలా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -