Sunday, May 5, 2024
- Advertisement -

‘బిగ్ బాస్’ హౌజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

‘బిగ్ బాస్’ ఎంత పాపులర్ రియాలిటీ షోనో అందరికీ తెలిసిందే. ఈ షోను హిందీలోనే కాకుండా కన్నడ, తెలుగు, తమిళంలో ప్రసారం చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ దీనికి మంచి ఆదరణ ఉంది. ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలను ‘బిగ్ బాస్’ హౌజ్‌లో ఉంచుతారు. అలాంటి ‘బిగ్ బాస్’ హౌజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం కన్నడ ‘బిగ్ బాస్’ హౌజ్‌లో సంభవించింది. ప్రస్తుతం కన్నడలో ‘బిగ్ బాస్’ ఐదో సీజన్ నడుస్తోంది.

‘బిగ్ బాస్’ హౌజ్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. హౌజ్ మొత్తం అగ్నికి ఆహుతైంది. రామనగర్, చెన్నపట్న, బెంగళూరు నుంచి వచ్చిన మొత్తం ఆరు అగ్నిమాపక శకటాలతో మంటలను అదులపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంటున్నారు. కన్నడ ‘బిగ్ బాస్’ షోకు కిచ్చ సుదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సీజన్ 5 షూటింగ్ ఇటీవలే ముగిసింది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -