- Advertisement -

జ‌గ‌నా.. ప‌వ‌నా.. కేసీఆర్ మ‌ద్ద‌తు ఎవ‌రికీ?

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల సాధ‌న కోసం చేప‌డుతున్న పోరాటం ఇప్పుడు ఉవ్వెత్తున ఎగుస్తోంది. ఇన్నాళ్లు ఇదే డిమాండ్‌పై పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆందోళ‌న‌ల‌ను తీవ్రం చేసింది. ఆ ఆందోళ‌న‌ల‌ను చ‌ట్ట‌స‌భ‌ల వైపు మ‌ళ్లించి రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఇప్పుడు పార్ల‌మెంట్‌లో అవిశ్వాసం పెడ‌తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో అన్ని రాజ‌కీయ పార్టీల్లో వ‌ణుకు పెట్టింది. కేంద్రంపై ఏకంగా ధిక్కార స్వ‌రం వినిపించ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ పార్టీలు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాయి. జ‌గ‌న్ అంత ధైర్యం ఎలా చేశారు? ఏమిటీ ఆయ‌న ప్లాన్‌? అని లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఎవ‌రు ఇస్తారు? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

వైఎస్సార్‌సీపీ పార్ల‌మెంట్‌లో అవిశ్వాసం పెట్టేంత బ‌లం లేదు. కానీ నోటీస్ ఇస్తే ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తుతో అవిశ్వాస తీర్మానం స్పీక‌ర్ ఆమోదించి చ‌ర్చ‌కు అవ‌కాశం ఇస్తారు. ఆ త‌ర్వాత ఓటింగ్ చేప‌డ‌తారు. కేంద్రాన్ని ప‌డ‌గొట్టేంత‌ బ‌లం అన్ని ప‌క్షాల‌ను క‌లిపినా లేదు. అయినా ఒక వాద‌న‌.. తమ డిమాండ్‌ను దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు తీసుకురావ‌డానికి వైఎస్సార్ సీపీ ప్లాన్ వేసింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి సోద‌ర రాష్ట్రం తెలంగాణ అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు.

టీఆర్ఎస్‌కు వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌ధ్య రాజ‌కీయంగా వైరం లేదు. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో వైఎస్సార్‌సీపీ గెలుస్తుంద‌ని అప్పుడు కేసీఆర్ భావించారు. కానీ ఆ విధంగా జ‌ర‌గ‌లేదు. కానీ ఎప్పుడూ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా కేసీఆర్ ఉంటున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ పార్టీ అవిశ్వాసం పెడుతున్నాడు మ‌రీ మ‌ద్ద‌తు ఇస్తాడో లేదో చూడాలి. మొన్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీల ఆందోళ‌న‌కు ఎంపీ క‌విత మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి జై ఆంధ్ర అని ప్ర‌సంగం ముగించారు.

అయితే ఈ మ‌ధ్య‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ఉన్నారు. మొన్న కేసీఆర్‌ను ప‌వ‌న్ క‌లిసి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు. జ‌గ‌న్ అవిశ్వాసం పెడితే తాను మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతా అని చెప్పారు. మ‌రీ టీఆర్ఎస్ మ‌ద్ద‌తు కోసం ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తాడా.. లేదా జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తాడా చూడాలి. వీరిద్ద‌రిలో ఎవ‌రూ స్పందిస్తే ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇస్తాడు. చివ‌రికి అవిశ్వాసానికి కేసీఆర్ మ‌ద్ద‌తు తెలుపుతారా లేదా చూడాలి.

కేంద్రం తెలంగాణ‌పైన కూడా వివ‌క్ష కొన‌సాగిస్తోంది. కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు అంత‌గా కేటాయింపులు ఏమీ లేవు. అయినా నిశ‌బ్దంగానే ఉన్నారు. కానీ కేంద్రం ప‌నితీరుతో అసంతృప్తిగానే ఉన్నారు. కానీ అదృశ్య హ‌స్తంగా కేంద్రానికి కేసీఆర్ మ‌ద్ద‌తు చెబుతున్నా.. ఇప్పుడు పోరాట స‌మ‌యంలో కేసీఆర్ వైఖ‌రి ఏంటో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -