- Advertisement -

పైరసీ జోలికి వెళ్ళను: ఐబొమ్మ రవి

- Advertisement -

ప్రముఖ తెలుగు సినిమాల పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఐబొమ్మ రవిని పోలీసులు తిరిగి కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా రవి పోలీసుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, మళ్ళీ పైరసీ జోలికి వెళ్లనని ప్రాధేయపడినట్లు సమాచారం.

రవి పోలీసులతో మాట్లాడుతూ, “ఆరేళ్లపాటు నన్నెవరూ పట్టుకోలేకపోయారు. అదే ధీమాతో నెట్ వర్క్‌ను మరింత పెంచుకుంటూ పోయాను” అని అంగీకరించాడు. మొదట్లో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే ఈ పైరసీ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలిపాడు. అయితే, ఇది చట్ట విరుద్ధమని, తప్పని తాను గుర్తించలేకపోయానని పేర్కొన్నాడు.

“జైలు నుండి బయటకు వచ్చాక పూర్తిగా మారిపోతా. మళ్ళీ పైరసీ జోలికి అస్సలు వెళ్ళను” అని పోలీసుల ముందు రవి వేడుకున్నట్లు తెలుస్తోంది. సినిమా పరిశ్రమకు తీరని నష్టాన్ని కలిగించిన రవిపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -