- Advertisement -

‘పెద్ది’ విధ్వంసానికి అల్లు అర్జున్ ఫిదా

- Advertisement -

దర్శకుడు బుచిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) థియేటర్లలో సరికొత్త చరిత్ర లిఖిస్తోంది. ఈ క్రేజీ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, గ్రిట్టీ యాక్టింగ్, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయని కొనియాడారు. ప్రతి విషయంలోనూ చరణ్ అద్భుతంగా నటించాడని.. నిజంగా గర్వపడుతున్నట్లు బన్నీ ట్వీట్ చేశారు.

ఈ చిత్రంలో విలన్‌గా నటించిన జగపతి బాబు నటన అద్భుతంగా ఉందన్న అల్లు అర్జున్.. హీరోయిన్ జాన్వీ కపూర్‌తో పాటు ఇతర నటీనటులకు అభినందనలు తెలిపారు. సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లను ప్రశంసించారు. ముఖ్యంగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ బుచిబాబు సానా ప్రతి ఒక్క పాత్రను ఎలివేట్ చేస్తూ రామ్ చరణ్‌ను అత్యున్నత శిఖరంలో నిలబెట్టారని బన్నీ కొనియాడారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ పాజిటివ్ ట్వీట్ మెగా అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్ జోష్ నింపింది. నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

మరోవైపు బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల వేట ఆగడం లేదు. మొదటి వీకెండ్ ముగిసిన తర్వాత కూడా సోమవారం వర్కింగ్ డే రోజున ఊహించని రేంజ్‌లో వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 315 కోట్ల బ్రహ్మాండమైన గ్రాస్ కలెక్షన్లను అందుకున్నట్లు నిర్మాణ సంస్థ ‘వృద్ధి సినిమాస్’ అధికారికంగా ప్రకటించింది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన ఈ ప్యాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా వీక్ డేస్‌లోనూ సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, బోమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం థియేటర్లలో ప్రేక్షకులను ఊపేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని సరికొత్త రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -