Wednesday, May 7, 2025
- Advertisement -

ఈ ‘సారీ‘ తీరని ముఖ్యమంత్రి కల

- Advertisement -

కెప్టెన్ విజయ్ కాంత్. తమిళ రాజకీయాలను మార్చేస్తానని, ఈ సారి ముఖ్యమంత్రి పదవి తనదే అని ప్రగల్బాలు పలికారు. డిఎంకె నేతలను, మీడియాను కూడా ఆడిపోసుకున్న విజయ్ కాంత్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో గల్లంతు అయ్యింది. అంతే కాదు.. విజయ్ కాంత్ తాను స్వయంగా పోటీ చేసిన స్ధానం నుంచి కూడా పరాజయం పాలయ్యేలా కనిపిస్తున్నారు.

జాతీయ ఛానెల్ కు గురువారం ఉదయం ఫలితాలు వెలువడడానిక ముందు  ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ కాంత్ రెచ్చిపోయారు. తాను హీరో అని, డిఎంకె అధినేత విలన్ అని, జయలలిత లేడీ విలన్ అంటూ గప్పాలు పోయారు.

చివరకు ఫలితాలు వెలువడే సమయానికి విజయ్ కాంత్ హీరో కాదు.. జీరోగా మిగిలిపోయారు. విజయ్ కాంత్ పోటీ చేసిన ఉళుందుర్ పెట్టాయ్ నియోజకవర్గంలో ఆయన మూడోస్థానంలో ఉన్నారు. అక్కడ  అన్నాడీఎంకే మెదటి స్ధానంలో ఉంటే డీఎంకే రెండో స్ధానంలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -