దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ రాజకీయ జీవితం అస్తవ్యస్తం అయిన విషయం తెలిసిందే. జయలలిత మరణానంతరం ఆమె సీఎం కుర్చీ ఎక్కాలని భావించారు. కానీ ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే ఆమె సీఎం కాకుండా జైలుకు వెళ్లడానికి బీజేపీ పెద్దలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆమె జైలుకు వెళ్లడంతో తన స్థానంలో తన అనుయాయుడు పళనిస్వామిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టారు. కానీ పళనిస్వామి సైతం హ్యాండ్ ఇచ్చాడు. ఏకంగా శశికళనే అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు.
ఈ విషయం పక్కకు పెడితే.. శశికళ తన మేనల్లుడు దినకరన్ తో ఏఎంఎంకే అనే రాజకీయపార్టీని స్థాపించారు. పార్టీ బాధ్యతలను ఆయనకే అప్పగించారు. ఆ పార్టీ అభ్యర్థులు పలు ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయారు. ఇదిలా ఉంటే శశికళ గత అసెంబ్లీ ఎన్నికల ముందే జైలు నుంచి బయటకొచ్చారు. ఈ టైంలోనే ఆమె అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకొనే చాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ అవేమి జరగలేదు.
శశికళను అన్నాడీఎంకే లోనికి రానివ్వకుండా ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో ఆమె తెర వెనక నుంచి పావులు కదుపుతున్నారు. శశి కళ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఏఎంఎంకే ప్రస్తుతం చిన్నా భిన్నం అవుతోంది. అందుకు కారణం తన మేనల్లుడు దినకరన్ యేనని ఆమె భావిస్తున్నారట. దీంతో దినకరన్‌ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని శశికళ ఆదేశించారట.
గతంలో 37 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను దినకరన్ తనవైపునకు తిప్పుకుని.. అన్నాడీఎంకేకు పోటీగా దినకరన్ ఏఎంఎంకేను స్థాపించారు. వీరిలో 18 మంది మాత్రమే దినకరన్‌ను అనుసరించి పార్టీ ఫిరాయింపు చట్టం కింద పదవిని కోల్పోయారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎంఎంకే పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు దినకరన్ వ్యవహార శైలి నచ్చక చాలా మంది ఏఐడీఎంకే, డీఎంకేలో చేరిపోతున్నారు. దీంతో శశికళ దినకరన్‌కు పక్కకు తప్పించినట్టు సమాచారం. ఆయన స్థానంలో మరో వ్యక్తిని పార్టీ బాధ్యుడిగా నియమించే చాన్స్ ఉన్నట్టు సమాచారం.
Also Read
సంక్షోభంలోనూ సంక్షేమం.. సీఎం జగన్
‘భయం’ తెలియని వ్యక్తులే కాంగ్రెస్‌కు కావాలి..! రాహుల్ గాంధీ..!
వైఎస్ షర్మిల ఎవ్వరో వదిలిన బాణం కాదు… అన్న వదిలిన బాణమే..!
