Thursday, April 25, 2024
- Advertisement -

విజయ్ కాంత్ తో స్టాలిన్ ఆకస్మిక భేటీ..! రాజకీయ వ్యూహమా.. పరామర్శనా..!

- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం ఆకస్మికంగా డీఎండీకే అధినేత విజయ్ కాంత్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అతి త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్టాలిన్ విజయ్ కాంత్ ను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్డీయేతో కలిసి పోటీ చేసిన డీఎండీకే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. విజయ్ కాంత్ 2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొన్ని నెలల్లోనే అనారోగ్యం పాలయ్యారు. ఈ ఏడాది ఎన్నికల ముందు కూడా ఆయన అమెరికాలో వైద్య చికిత్సలు తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఆయన ఇంటి పట్టునే ఉంటున్నారు. పార్టీ వ్యవహారాలను ఆయన భార్య ప్రేమ లత, కుమారుడు విజయ్ ప్రభాకరన్ చూసుకుంటున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా విజయ్ కాంత్ ప్రచారంలో పాల్గొన లేదు. విజయ్ కాంత్ పార్టీకి తమిళనాడులో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఉంది. 2005లో డీఎండీకేని స్థాపించిన విజయ్ కాంత్ 2006లో జరిగిన ఎన్నికల్లో పోటీ పడి తానొక్కరే విజయం సాధించారు. ఆ తర్వాత 2011లో జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే కూటమితో కలిసి పోటీ చేసిన విజయ్ కాంత్ అనూహ్యంగా 29 స్థానాలు సాధించి ఆశ్చర్య పరిచారు. ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు. 2016 -21లలో జరిగిన ఎన్నికల్లో విజయ్ కాంత్ పార్టీ సీట్లు గెలుచుకోకపోయినప్పటికీ చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి.

కాగా తమిళనాడులో అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్టాలిన్ విజయ్ కాంత్ భేటీ కావడం సంచలనం సృష్టించింది. విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను పరామర్శించేందుకు స్టాలిన్ విజయ్ కాంత్ ని కలుసుకున్నారని డీఎంకే నేతలు చెబుతున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎండీకే పార్టీని కలుపుకొని పోయేందుకే స్టాలిన్ విజయ్ కాంత్ ని కలుసుకున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన డీఎంకే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు ముందస్తుగా సిద్ధం అవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Also Read

రాజకీయాల్లోకి రానప్పుడు దాని అవసరం లేదన్న తలైవా..!

థర్డ్​వేవ్​ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!

‘దృశ్యం’ రిజెక్ట్​ చేసిన రజనీకాంత్​? కారణం ఏమిటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -