Friday, May 24, 2024
- Advertisement -

టీనేజర్ తో సెక్స్… అమెరికాలో ఇండియన్ టీచర్ అరెస్ట్..!

- Advertisement -

టీనేజర్ తో సెక్స్ ఆరోపణలపై అమెరికాలో ఒక భారతీయ టీచర్ అరెస్టైంది. ఇండియానా రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి పోలీసులిచ్చిన వివరాల ప్రకారం.. మిహిర్ పటేల్ (24) అనే ఒక టీచర్ 16 ఏళ్ల టీనేజర్ తో ఎఫైర్ పెట్టుకుంది.

ఆ రాష్ట్ర చట్టాల ప్రకారం ఆ వయసు యువతీ, యువకులతో సెక్స్ నిషిద్ధం. ఆ వయసు వాళ్ల ఇష్టంతో సెక్స్ లో పాల్గొన్నా దాన్ని అత్యాచారంగానే పరిగణిస్తారు. మిహిర్ పటేల్ విషయంలో కూడా అదే జరిగింది. ఆమె టీనేజర్ తో సెక్స్ లో పాల్గొన్ననేరం కిందట కేసు నమోదు చేశారు.

ఆ టీనేజర్ ఇస్తున్న సమాచారం ప్రకారం.. వాళ్లిద్దరికీ ఆన్ లైన్ లో పరిచయం అయినట్టుగా తెలుస్తోంది. ఆ పరిచయంతోనే వారు శారీరకంగా కలయిక వెళ్లి నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై మిహిర్ పనిచేస్తున్న  స్కూలు యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసి ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఒకవైపు బాధ్యతాయుతమైన టీచర్ గా పనిచేస్తూ.. ఒక భారతీయురాలు తన కన్న ఎనిమిదేళ్లు చిన్నవాడైన కుర్రాడితో సంబంధం పెట్టుకోవడం నిజంగా ఖండించదగిన అంశమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -