టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. గత కొన్నాల్లుగా గంభీర్ భాజాపలో చేరుతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలపై స్పందించిన గంభీర్ స్తుతానికైతే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. భాజాపా తరుపునుంచి ఎంపీ అభ్యర్తిగా గంభీర్ పోటీ చేయనున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అధిష్ఠానం ఇప్పటికే గంభీర్‌తో సంప్రదింపులు జరుపుతోందని, న్యూఢిల్లీ సీటు నుంచి ఆయనను బరిలోకి దింపాలని భాజాపా భావిస్తున్నట్లు సమాచారం. గంభీర్ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే గంభీర్…పుల్వామా ఘటనపై కూడా స్పందించారు. పాక్‌తో చర్చలు ఉండవని ఇక యుద్ధరంగంలోనె తేల్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గంభీర్ కనుక బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందితే, రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మరో క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. మరి ఈవార్త ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సిఉంది.
- Advertisement -
భాజాపా తరుపును ఢిల్లీ ఎంపీ బరిలో మాజీ క్రికెటర్…?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -